థాంక్యూ మంచు విష్ణు అంటూ పోస్ట్ పెట్టిన‌ కంగనా రనౌత్ (Kangana Ranaut)

Updated on May 17, 2022 05:13 PM IST
మా అధ్య‌క్షుడు మంచు విష్ణు (Manchu Vishnu)కు కృత‌జ్ఞ‌త‌లంటూ  కంగనా రనౌత్ (Kangana Ranaut)  పోస్ట్
మా అధ్య‌క్షుడు మంచు విష్ణు (Manchu Vishnu)కు కృత‌జ్ఞ‌త‌లంటూ కంగనా రనౌత్ (Kangana Ranaut) పోస్ట్

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ (Kangana Ranaut) డిఫ‌రెంట్ సినిమాల‌తో అద‌రగొడుతుంటారు. రీసెంట్‌గా ధాక‌డ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న కంగ‌నా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చారు. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం త‌ర్వాత కంగ‌నా త‌న ఇస్టాలో ఓ పోస్ట్ పెట్టారు.

ధాక‌డ్ సినిమా గుఢాచారిలా యాక్ష‌న్, థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు ర‌జ‌నీస్ ఘాయ్ తెర‌కెక్కించారు. మ‌రో మూడు రోజుల్లో ధాక‌డ్ సినిమా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ కంటే ముందు ధాక‌డ్ చిత్ర యూనిట్ తిరుమల  శ్రీ వేంకటేశ్వరస్వామిని ద‌ర్శించుకున్నారు. కంగ‌నాతో పాటు నిర్మాత దీపక్ ముకుట్, ఆయన భార్య కృష్ణ ముకుట్, తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. 

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం త‌ర్వాత కంగనా రౌన‌త్ ఇస్టాలో మంచు విష్ణుకు థాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టారు. శ్రీవారి ద‌ర్శ‌న ఏర్పాట్ల‌ను చేసిన మా అధ్య‌క్షుడు మంచు విష్ణు (Manchu Vishnu)కు కృత‌జ్ఞ‌త‌లంటూ పోస్ట్ పెట్టారు. తిరుమ‌ల టూర్ ఫోటోల‌ను ఇస్టాలో షేర్ చేశారు. 

అసెలం ఫిలిమ్స్, సోహం రాక్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, సోహెల్ మక్లాయి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ధాక‌డ్ సినిమా నిర్మించారు. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, దివ్యా దత్తా, సస్వత ఛటర్జీ ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా సినిమాగా మే 20న థాక‌డ్ రిలీజ్ కానుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!