చిత్తుగ కుమ్మి.. ప‌చ్చిడి చేస్తే చ‌చ్చిపోతావురా.. అంటూ మాస్ స్టెప్పులేసిన‌ క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan)

Updated on May 28, 2022 11:09 PM IST
విక్ర‌మ్ సినిమా నుంచి తెలుగు పాట‌ను రిలీజ్ చేశారు. డాన్సులతో క‌మ‌ల్ (Kamal Hasan) అద‌ర‌గొడుతున్నారు.
విక్ర‌మ్ సినిమా నుంచి తెలుగు పాట‌ను రిలీజ్ చేశారు. డాన్సులతో క‌మ‌ల్ (Kamal Hasan) అద‌ర‌గొడుతున్నారు.

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాసన్ (Kamal Hasan) కు ఉన్నక్రేజే వేరు. త‌న న‌ట విశ్వ‌రూపంతో ప్రేక్ష‌కుల‌కు క‌మ‌ల్ వినోదం పంచుతారు. క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న విక్రమ్  (Vikram) సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇటీవలే' విక్ర‌మ్' సినిమా నుంచి ఆయన ఓ తెలుగు పాట‌ను రిలీజ్ చేశారు. అలాగే డాన్సులతో క‌మ‌ల్ అద‌ర‌గొడుతున్నారు. మాస్ మ్యూజిక్‌కు తీన్ మార్ డాన్సులు వేస్తూ క‌మ‌ల్ హాస‌న్ కిక్ ఇస్తున్నారు.

క‌మ‌ల్ హాసన్ (Kamal Hasan) కొత్త సినిమా 'విక్రమ్'. ఈ సినిమా నుంచి తెలుగు సాంగ్ రిలీజ్ అయింది. ఆ పాట‌కు క‌మ‌ల్ సిగ్నేచ‌ర్ స్టెప్‌ల‌తో రెచ్చిపోతున్నారు. చాలా రోజుల త‌ర్వాత డాన్స్‌ల‌తో అభిమానుల‌కు కిక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో 'విక్ర‌మ్' సినిమా తెర‌కెక్కుతుంది. యాక్ష‌న్ మూవీగా విక్ర‌మ్ సినిమా రిలీజ్ కానుంది.  ఈ సినిమాకు సంగీత దర్శకుడు అనిరుధ్  మ్యూజిక్ అందించారు. త‌మిళంలో ఆ పాట ముందే రిలీజ్ అయి హిట్‌గా నిలిచింది. ఇప్పుడు తెలుగు వెర్ష‌న్‌ను రిలీజ్ చేశారు. 

త‌మిళంలో క‌మ‌ల్ హాసన్ (Kamal Hasan) ఈ పాట‌ను స్వయంగా రాశారు. అంతేకాదు ఆ పాట‌ను క‌మ‌ల్ పాడారు కూడా. తెలుగులో మాత్రం చంద్ర‌బోస్ లిరిక్స్ రాశారు. కాకపోతే, క‌మ‌ల్ హాస‌న్ తెలుగు పాట‌ను స్వ‌యంగా పాడారు. డాన్స్ మాస్ట‌ర్ లోకేష్, క‌మ‌ల్ హాస‌న్‌తో సిగ్నేచ‌ర్ స్టెప్పులు వేయించారు. ఇదే క్రమంలో, క‌మ‌ల్ 'డాన్స్ సూప‌ర్' అంటూ ఫ్యాన్స్ మెసేజ్‌లు పెడుతున్నారు. చాలా రోజుల త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ డాన్స్ చూసే అదృష్టం దొరికిందంటూన్నారు. క‌మ‌ల్ పాడిన పాట చాలా బాగుందంటున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!