12 రోజులు గడుస్తున్నా కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న కల్యాణ్‌రామ్ (KalyanRam) బింబిసార మూవీ!

Updated on Aug 18, 2022 12:36 PM IST
కల్యాణ్‌ రామ్ (Kalyan Ram) నటించిన బింబిసార మొదటిరోజు నుంచే హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది
కల్యాణ్‌ రామ్ (Kalyan Ram) నటించిన బింబిసార మొదటిరోజు నుంచే హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది

నందమూరి కల్యాణ్ రామ్ (KalyanRam) కెరీర్‌‌లో హయ్యెస్ట్ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం 'బింబిసార'. సోషియో ఫాంటసీ, టైం ట్రావెల్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మల్లిడి వశిష్ట్ తెరకెక్కించారు. 'ఎన్టీఆర్ ఆర్ట్స్' బ్యానర్ పై కల్యాణ్ రామ్ హరికృష్ణతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.

ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని అందరిలోనూ కలిగించాయి. అందుకు తగ్గట్టే మొదటి రోజు ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సంపాదించుకోవడంతో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక 'బింబిసార' వీక్ డేస్‌లో కూడా అత్యధిక కలెక్షన్లు నమోదు చేసి రికార్డులు తిరగరాసింది. ఈ చలనచిత్రం రెండో వీకెండ్‌ను కూడా బాగానే క్యాష్ చేసుకుంది. రిలీజ్ అయిన 12 వ రోజు కూడా 'బింబిసార' మూవీ తన సత్తాను చాటుతూనే ఉంది. 

కల్యాణ్‌ రామ్ (Kalyan Ram) నటించిన బింబిసార మొదటిరోజు నుంచే హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది

12 రోజుల కలెక్షన్స్ గమనిస్తే :

నైజాం - 9.90 cr

సీడెడ్ - 6.51 cr

ఉత్తరాంధ్ర - 4.28 cr

ఈస్ట్ - 1.70 cr

వెస్ట్ - 1.29 cr

గుంటూరు - 1.98 cr

కృష్ణా - 1.47 cr

నెల్లూరు - 0.82 cr

ఏపీ + తెలంగాణ (టోటల్) - 27.95 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా - 1.98 cr

ఓవర్సీస్ - 2.15 cr

వరల్డ్ వైడ్ (టోటల్) 32.08 cr

'బింబిసార' చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే.. రూ.16 కోట్ల షేర్  రాబట్టాల్సి ఉంది. 12 రోజులు పూర్తయ్యేసరికి, ఈ చిత్రం రూ.32.08 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసింది. ఈ చిత్రం వీకెండ్ సమయానికే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయడమే కాకుండా, ఇప్పటివరకు బయ్యర్లకు రూ.16.08 కోట్ల లాభాలను అందించింది.

Read More : 'బింబిసార‌'తో క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) కొత్త ప్ర‌యోగం.. ఫస్ట్ డే క‌లెక్ష‌న్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!