Jwala Movie Teaser : ద‌మ్ముంటే త‌న‌ను గెలుచుకోమంటూ స‌వాల్ విసిరిన విజ‌య్ ఆంటోని

Updated on May 27, 2022 05:52 PM IST
Jwala Movie Teaser: జ్వాల టీజ‌ర్‌ను న‌టుడు రానా ద‌గ్గుబాటి సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
Jwala Movie Teaser: జ్వాల టీజ‌ర్‌ను న‌టుడు రానా ద‌గ్గుబాటి సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

Jwala Movie Teaser: విజ‌య్ అంటోని త‌మిళ న‌టుడే అయినా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చిన హీరో. బిచ్చ‌గాడు సినిమాలో అమ్మ సెంటిమెంట్‌తో మెప్పించాడు. ప్ర‌స్తుతం జ్వాల సినిమాతో పాన్ ఇండియా స్టార్ కావాల‌నుకుంటున్నారు. విజ‌య్ అంటోని కొత్త సినిమా జ్వాల టీజ‌ర్ (JwalaTeaser) యూట్యూబ్‌లో రిలీజ్ అయింది. యాక్ష‌న్ సీన్స్, మాస్ డైలాగుల‌తో దూసుకెళుతుంది.

సాహో ఫేమ్‌ అరుణ్‌ విజయ్‌తో క‌లిసి విజయ్‌ ఆంటోని నటించిన  సినిమా జ్వాల. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. జ్వాల టీజ‌ర్‌ను న‌టుడు రానా ద‌గ్గుబాటి సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ప‌వ‌ర్ ఫుల్ డైలాగుల‌తో టీజ‌ర్ అదిరిపోతుంది. 'ఓడినవాడు చస్తాడు గెలిచినవాడు మాత్రమే బ్రతుకుతాడు...బతికుంటే అలాంటి ఒక గెలుపుతో బతికుండాలి. చచ్చినాకూడా అలాంటి వాడి చేతిలో చచ్చాము అనే గర్వంతో చావాలి' ఇలాంటి మాస్ డైలాగులు జ్వాల టీజ‌ర్‌లో వినిపించాయి. 

కేజీఎఫ్ చాప్ట‌ర్2, ఆర్.ఆర్.ఆర్. సినిమాలు పాన్ ఇండియా లెవల్‌లో హిట్ సాధించాయి. అలానే జ్వాల కూడా  ఇండియ‌న్ సినిమా రికార్డులు బ‌ద్దలు కొట్టేలా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. అరుణ్ విజ‌య్, విజ‌య్ అంటోని ఇద్ద‌రూ ఇద్ద‌రూ. యాక్ష‌న్ సీన్ల‌లో వీరిద్ద‌రి డైలాగుల‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. 

జ్వాల సినిమాలో అక్షరహాసన్ స్పెష‌ల్ రోల్‌లో యాక్ట్ చేశారు. ఈ సినిమాను అమ్మ క్రియేషన్స్ స‌మ‌ర్పిస్తుంది. శర్వాంత్‌రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై జవ్వాజి రామాంజనేయులు, షిరిడిసాయి మూవీస్‌ పతాకంపై యం.రాజశేఖర్‌ రెడ్డి నిర్మించారు. 

జ్వాల షూటింగ్ ప‌లు దేశాల్లో జ‌రిపారు.  రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జ‌రిగింది. ఇండియాలోని కలకత్తాలో కొన్ని యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రించారు. నవీన్ డైరెక్ష‌న్ కేక పుట్టించేలా ఉంటుంద‌ని ఆడియ‌న్స్ అభిప్రాయ ప‌డుతున్నారు.  ప్రకాశ్‌రాజ్, రైమాసేన్,నాజర్‌ లాంటి సీనియర్ ఆర్టిస్టులు జ్వాల‌లో క‌నిపించ‌నున్నారు.

జ్వాల సినిమా టీజ‌ర్ (JwalaTeaser) ను రిలీజ్ చేసిన రానా ద‌గ్గుపాటి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. విజ‌య్(Vijay Antony), అరుణ్‌ (Arun Vijay) ల‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. జ్వాల సినిమా టీజ‌ర్ అదిరిపోయిందంటూ ట్వీట్ చేశారు రానా ద‌గ్గుబాటి. ఇక యూట్యూబ్‌లో ఏ రేంజ్‌లో దూసుకెళుతుందో చూడాలి.

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!