కొరటాల శివ(Koratala Siva) సినిమాలో కొత్త లుక్‌లో తారక్ (Jr NTR)
ప్రతి సినిమాలో కొత్తగా కనిపిస్తేనే ప్రేక్షకులు, అభిమానులు ఆదరిస్తారు. హీరోహీరోయిన్లను తెరపై కొత్తగా చూపించడానికి దర్శకులు తపిస్తుంటారు. దానికి తగ్గట్టుగానే హీరోలు కూడా స్టైలిష్‌గా కనిపించడానికి సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ వంటి వాటి కోసం చాలా కష్టపడతారు. అంతేకాదు అందంగా కనిపించడానికి రకరకాలుగా ట్రై చేస్తుంటారు కూడా. అందులో భాగంగా హెయిర్‌స్టైల్ మార్చుకోవడం, టాటూలు వేసుకోవడంతోపాటు వివిధ స్టైల్స్‌ను ఫాలో అవుతారు.
ఇక, చేసే ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడానికి, నటనలో వైవిద్యంతో అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). తన మొదటి సినిమాలో బొద్దుగా కనిపించిన తారక్.. తరువాతి సినిమాల్లో కొద్దికొద్దిగా సన్నబడి అభిమానులను సంపాదించుకున్నారు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. నటనలోని వైవిద్యం, డ్యాన్స్, మాస్ సినిమాలతో తక్కువ కాలంలోనే స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకున్నాడు.
రాఖీ, అశోక్ వంటి సినిమాల్లో బాగా లావుగా కనిపించి విమర్శలు ఎదుర్కొన్న ఎన్టీఆర్ (Jr NTR) తరువాత వచ్చిన కంత్రీ సినిమాలో బక్క పలుచటి లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే మరీ సన్నగా కావడంతో హీరో అప్పియరెన్స్ లేదని చాలా మంది నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఇక, తరువాత సినిమాల్లో కొద్దికొద్దిగా తన అప్పియరెన్స్‌ను మార్చుకుంటూ వచ్చిన తారక్ (Jr NTR), ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో కొత్త హెయిర్ స్టైల్, కొత్త లుక్స్‌తో అందరినీ అట్రాక్ట్ చేశాడు. కొన్ని సినిమాల్లో ఎయిట్ ప్యాక్‌లో కనిపించిన ఎన్టీఆర్ (Jr NTR) ఇటీవల విడుదలైన పాన్ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌లో మరో కొత్త గెటప్‌లో కనిపించాడు. ఈ సినిమా టాలీవుడ్‌తోపాటు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోందని సమాచారం. ఈ సినిమాలో తారక్ (Jr NTR) కొత్త లుక్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. మరింత స్టైలిష్‌గా కనిపించడానికి ఎన్టీఆర్ (Jr NTR) ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి అభిమానుల కోసం తారక్ (Jr NTR) ఎలా కనిపించనున్నాడో వేచి చూడాల్సిందే.
ఇక, కొరటాల శివ (Koratala Siva) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన సినిమాలో హీరోలను వారివారి క్యారెక్టర్లకు తగినట్టుగా లుక్స్ ఛేంజ్ చేసి చూపించడంలో కొరటాల (Koratala Siva) దిట్ట. ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్‌ను క్లాసీగా చూపిస్తూనే సెకండాఫ్‌లో మాస్ ఫైట్స్ చేయించి ఫ్యాన్స్‌తో విజిల్స్ కొట్టించాడు. ఇక మహేష్‌బాబు (MaheshBabu), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమాలో యువ సీఎంగా సూపర్‌స్టార్‌ను సూపర్ స్టైలిష్‌గా చూపించాడు.
‘జనతా గ్యారేజీ’ సినిమాలో మాస్ క్యారెక్టర్‌ను ఎన్టీఆర్ (Jr NTR)తో చేయిస్తూనే కొత్త లుక్‌లో తారక్ (Jr NTR)ను చూపించడంలో సక్పెస్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో ఇప్పుడు రాబోయే సినిమాలో తారక్‌ను ఎలా చూపించబోతున్నాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి (Megestar Chiranjeevi)తో చేసిన ఆచార్య సినిమా రిలీజ్‌కు రెడీ కావడంతో తన తదుపరి సినిమా పనులను కొరటాల స్టార్ట్ చేశారు.