హిందీ జెర్సీలో కావాలనే యాక్ట్ చేయలేదు: రష్మిక మందన(Rashmika Mandanna)
టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా రష్మిక మందన(Rashmika Mandanna)కు మంచి గుర్తింపు ఉంది. రష్మిక సెలెక్ట చేసుకునే సినిమాలు దాదాపు హిట్ అవుతాయి. బాలీవుడ్ జెర్సీలో యాక్ట్ చేయకపోవడానికి కారణాలు చెప్పింది రష్మిక మందన.
టాలీవుడ్ హీరోయిన్లు బాలీవుడ్ ఆఫర్ల కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. హిందీ సినిమా నటులు తెలుగులో యాక్ట్ చేయాలని ఉత్సాహ పడుతున్నారు. హీరోయిన్ రష్మిక మందన(Rashmika Mandanna)కు జెర్సీ హిందీ రీమేకింగ్ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందట. కానీ రష్మిక ఆ సినిమాలో యాక్ట్ చేయనని చెప్పిందట.
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన జెర్సీ బాక్పాఫీస్ దగ్గర బోల్తా పడింది. అంత హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. తెలుగు హీరో నాని చేసిన జెర్సీనీ హిందీలో రీమేక్ చేశారు షాహిద్ కపూర్. తెలుగులో వచ్చినంత గుర్తింపు ఈ సినిమాకు హిందీలో రాలేదు. షాహిద్ భార్యగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకుర్ నటించింది. మొదట జెర్సీ సినిమాలో షాహిద్ భార్యగా రష్మిక మందనాను నటించమని అడిగారట. ఆయితే ఆ ఆఫర్ రష్మిక తిరస్కరించారు. అప్పట్లో ఈ పాత్ర తిరస్కరించిందని వార్తలు కూడా వచ్చాయి.
హిందీ జెర్సీ ఆఫర్ గురించి రష్మిక మందన రీసెంట్‌గా కామెంట్ చేశారు. షాషిద్‌తో కలిసి జెర్సీలో నటించమని అడిగారని.. అందుకు తాను ఒప్పుకోలేదని రష్మిక చెప్పారు. కమర్షియల్ సినిమాల్లో నటించే తాను జెర్సీ సినిమాలో మాత్రం నటించలేకపోయాను. నేను శ్రద్ధా శ్రీనాథ్ అంత గొప్పగా నటించేదాన్ని కాదేమో.. తన వల్ల దర్శక, నిర్మాతలు నష్టపోకూడదంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రష్మిక మందన(Rashmika Mandanna) తెలుగు పుష్ప 2తో పాటు హిందీలో యానిమల్ చిత్రాలతో బిజీగా ఉంది.