జ‌య‌మ్మ పంచాయితీ (Jayamma Panchayathi) : పాటలోనే స్టోరీ

Updated on Apr 26, 2022 03:33 PM IST
స్టార్ యాంకర్ సుమ‌ లీడ్ రోల్‌లో జ‌య‌మ్మ పంచాయితీ (Jayamma Panchayathi) నుంచి ఎమోష‌న‌ల్ సాంగ్ రిలీజ్ చేశారు.  “గొలుసు కట్టు గోసలు” హృద‌యాల‌ను క‌దిలించే పాట అంటున్నారు. సుమ సినిమా స్టోరీ ఈ పాట‌లోనే ఉందా?.
స్టార్ యాంకర్ సుమ‌ లీడ్ రోల్‌లో జ‌య‌మ్మ పంచాయితీ (Jayamma Panchayathi) నుంచి ఎమోష‌న‌ల్ సాంగ్ రిలీజ్ చేశారు.  “గొలుసు కట్టు గోసలు” హృద‌యాల‌ను క‌దిలించే పాట అంటున్నారు. సుమ సినిమా స్టోరీ ఈ పాట‌లోనే ఉందా?.

స్టార్ యాంకర్ సుమ‌ లీడ్ రోల్‌లో జ‌య‌మ్మ పంచాయితీ (Jayyama Panchayiti) నుంచి ఎమోష‌న‌ల్ సాంగ్ రిలీజ్ చేశారు.  “గొలుసు కట్టు గోసలు” హృద‌యాల‌ను క‌దిలించే పాట అంటున్నారు. సుమ సినిమా స్టోరీ ఈ పాట‌లోనే ఉందా?.


జ‌య‌మ్మ పంచాయితీ (Jayyama Panchayiti) సినిమాతో ఓ ప‌వ‌ర్‌ఫుల్ మ‌హిళగా క‌నిపిస్తున్నారు సుమ క‌న‌కాల. గొలుసు క‌ట్టు గోస‌లు అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్‌ను లెటెస్టుగా రిలీజ్ చేశారు. కీర‌వాణి సంగీతం స‌మ‌కూర్చిన ఈ పాట‌ను చారు హరిహ‌ర‌న్ పాడారు.  చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు.  పాట విన్నవారు చాలా ఎమోష‌న‌ల్ ఫీల్ ఉంద‌టున్నారు. అస‌లు సినిమా స్టోరీ మొత్తం ఈ పాట‌లోనే దాగుందా అనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

స్టార్ యాంకర్ సుమ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సినిమా జ‌య‌మ్మ పంచాయితీ. సుమ కొద్ది రోజుల నుంచి ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నారు. టాప్ తెలుగు యూట్యూబ్స్ ఇంటికి వెళ్లి మ‌రీ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. సినిమాకు హిట్ టాక్ క్రియేట్ చేసే ప‌నిలో సుమ ఢిఫెరంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. సోష‌ల్ ఫ్లాట్ ఫామ్స్‌ల్లో హ‌డావుడి పెంచేశారు. 


జ‌య‌మ్మ పంచాయితీ (Jayyama Panchayiti)లో విడుద‌లైన గొలుసు క‌ట్టు గోస‌లు తెర‌పై ఇంకెంత ఎమోష‌న‌ల్ చేస్తుందో చూడాలి. సుమ ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. జ‌య‌మ్మ పంచాయితీ త‌ర్వాత కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేస్తాన‌ని సుమ చెబుతున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!