శేఖర్‌‌ కమ్ముల (Sekhar Kammula) లీడర్‌–2లో హీరో రానా కాదా?

Updated on Apr 27, 2022 07:49 PM IST
రానా, శేఖర్ కమ్ముల (Sekhar Kammula)
రానా, శేఖర్ కమ్ముల (Sekhar Kammula)

క్లాసికల్ సినిమాలు తీసి హిట్‌ కొట్టడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ముందు వరుసలో ఉంటాడు. రామానాయుడి మనవడు, సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు దగ్గుబాటి రానాను టాలీవుడ్‌కు హిట్‌ హీరోగా పరిచయం చేసిన ఘనత శేఖర్‌‌ కమ్ములది. ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు హీరోగా రానా అరంగేట్రం గ్రాండ్‌గా జరగడానికి కూడా లీడర్‌‌ బాటలు వేసింది. అయితే ఆ సినిమాకు సీక్వెల్‌ ఉండబోతోందని టాలీవుడ్‌లో టాక్ నడిచింది. అయితే దాని తాజాగా కొన్ని వార్తలు ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇటీవల నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కించిన లవ్‌స్టోరీ సినిమా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతకుముందు మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌తో తీసిన ఫిదా కూడా ప్రేక్షకులను అలరింపజేసింది. ఇక, లీడర్‌‌ సీక్వెల్‌కు సంబంధించి ఒక అప్‌డేట్‌ వచ్చింది. శేఖర్‌‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చి సూపర్‌‌హిట్ అయిన లీడర్‌‌ సీక్వెల్‌లో రానా కాకుండా వేరే హీరో నటించబోతున్నట్టు తెలుస్తోంది. లీడర్‌‌ 2 సినిమాలో తమిళహీరో సూర్య హీరోగా నటించబోతున్నారని సమాచారం. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ కావడం, ఫస్ట్ పార్ట్ సూపర్‌‌ హిట్‌ టాక్ తెచ్చుకోవడంతో సీక్వెల్‌లో నటించేది ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తెరకెక్కించబోయే సీక్వెల్‌ లీడర్‌‌2లో హీరోగా ఎవరు నటించబోతున్నారనే దానిపై క్లారటీ రావాల్సి ఉంది.

1972 ఫిబ్రవరి 4వ తేదీన హైదరాబాద్‌లో పుట్టిన శేఖర్‌‌ కమ్ముల అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్​వేర్ ఇంజినీర్‌‌గా పనిచేశాడు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘డాలర్ డ్రీమ్స్‌’ సినిమాకి ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారం లభించింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్‌‌, లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా, లవ్‌స్టోరి సినిమాలు తీశారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!