ఆచార్య ధర్మస్థలి (Acharya Dharmasthali) అతి పెద్ద సినిమా సెట్
ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పలు అంశాలు హైలెట్‌గా నిలిచాయి. ఆచార్య ధర్మస్థలి(Acharya Dharmasthali) సెటింగ్ చాలా అద్భుతంగా తీర్చి దిద్దారు. ఇండియాలోనే అతి పెద్ద సినిమా సెటింగ్ ఇప్పడు ఇదేనట.
చిరంజీవి, రామ్ చరణ్ తండ్రీ కొడుకులు ఇద్దరు కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఆచార్య. కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీసున్న సినిమా ఇది. ఆచార్య సినిమా కోసం వేసిన సెట్టింగ్ మాములుగా లేదు. ఆచార్య సినిమా చేయాలనుకున్నప్పుడే ఓ టెంపుల్ లుక్ కావాలనుకున్నామని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. అన్ని చోట్లా వెతికినా కావాల్సిన లొకేషన్ దొరకకపోవడంతో
ధర్మస్థలి సృష్టించామని చెప్పారు.
ఆచార్య ధర్మస్థలి(Acharya Dharmasthali) సెట్ చూస్తే నిజంగా కట్టారేమో అనిపిస్తుంది. ఓ అద్భుతమైన టెంపుల్ కోనేరు జలపాతాలు ఎటు చూసినా పచ్చని పైరులు మనసుకు హాయినిచ్చేలా ఉన్నాయి. ధర్మం గురించి సాగే కథ ఆచార్య. అందుకే ధర్మస్థలి అని పేరు పెట్టారు. ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ దేశంలోని ప్రముఖ దేవాలయాలు చూసొచ్చి మరీ ఈ సెట్ నిర్మించారు. 20 ఎకరాల్లో కోట్ల రూపాయలతో ఆచార్య ధర్మస్థలి(Acharya Dharmasthali) నిర్మించామని కొరటాల శివ చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవికి జోడిగా కాజల్ నటించారు. ప్రతీ సీన్ వినోదం అందించేలా ఉండాలని చిరంజీవి కేర్ తీసుకున్నారట.
పూజ హెగ్డె రామ్ చరణ్ సరసన నటించారు. ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర అరగంట పాటు మాత్రమే ఉంటుందని టాక్.
తక్కువ టైం రామ్ చరణ్ కనిపించినా... ఎక్కువ ఎమోషనల్ రోల్ అట. ఆచార్య ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది.