ఉత్త‌మ న‌టి (Keerthy Suresh) చెల్లెలు క్యారెక్టర్లకు ఓకే చెప్పేశారు.

Updated on May 15, 2022 03:48 PM IST
త‌మిళ్ సినిమా అన్నాత్తైలో కీర్తి సురేష్ (Keerthy Suresh) ర‌జ‌నీకాంత్ పెద్ద చెల్లిగా న‌టిస్తున్నారు.
త‌మిళ్ సినిమా అన్నాత్తైలో కీర్తి సురేష్ (Keerthy Suresh) ర‌జ‌నీకాంత్ పెద్ద చెల్లిగా న‌టిస్తున్నారు.

సౌత్ సినిమాల్లో సూప‌ర్ హిట్ సినిమాల‌తో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) . హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కూడా మెప్పించ‌నున్నారు. ర‌జ‌నీకాంత్ సినిమాలో చేయ‌డ‌మంటే ప్ర‌తీ హీరోయిన్‌కు ఓ మంచి అవ‌కాశం వ‌చ్చిన‌ట్టేగా. కీర్తి సురేష్ కూడా ర‌జ‌నీకాంత్‌తో న‌టించ‌డ‌మంటే ఇష్టం అంటున్నారు. 

నేను.. శైలజ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన‌ హీరోయిన్‌ కీర్తి సురేశ్ ఆ త‌ర్వాత మ‌హాన‌టి సినిమాలో లీడ్ క్యారెక్ట‌ర్ చేశారు. మ‌హాన‌టిగా ఉత్త‌మ న‌టి కేట‌గిరిలో నేష‌న‌ల్ అవార్డు అందుకున్నారు కీర్తి సురేష్. మ‌హాన‌టి త‌ర్వాత పెద్ద గుర్తింపు ఉన్న సినిమాలు కీర్తి సురేష్ చేయ‌లేదు .లేడీ ఓరియంటేడ్‌ సినిమాలు గుడ్‌లక్‌ సఖీ,  పెగ్విన్‌, చిన్ని సినిమాలు కీర్తి సురేష్‌కు హిట్ ఇవ్వ‌లేదు. రీసెంట్‌గా స‌ర్కారు వారి పాట సినిమాతో తిరిగి క్రేజ్ సంపాదించుకున్నారు. 

త‌మిళ్ సినిమా అన్నాత్తైలో కీర్తి సురేష్ (Keerthy Suresh) ర‌జ‌నీకాంత్ పెద్ద చెల్లిగా న‌టిస్తున్నారు.

కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్ర‌స్తుతం కొంద‌రు స్టార్ హీరోల సినిమాల్లో చెల్లెలు పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చెల్లెలు పాత్ర‌లు ఎందుకు చేస్తున్నారో కీర్తి సురేష్ ఆన్స‌ర్ చేశారు.  మంచి పాత్ర‌ల‌ను వదులుకోవ‌డం ఇష్టం లేద‌ని.. ప్ర‌స్తుతం ఉన్న ఫేమ్ భ‌విష్య‌త్తులో ఉండ‌ద‌ని కీర్తి అన్నారు. భ‌విష‌త్తులో ప్ర‌స్తుతం వ‌స్తున్న పాత్ర‌ల‌ను చేసే అవ‌కాశం రాక‌పోవ‌చ్చ‌న్నారు. బెస్ట్ ఆఫ‌ర్స్ అన్నింటిని చేయాల‌నుకుంటున్నాని కీర్తి చెప్పారు.

 

త‌మిళ్ సినిమా అన్నాత్తైలో కీర్తి సురేష్ (Keerthy Suresh) ర‌జ‌నీకాంత్ పెద్ద చెల్లిగా న‌టిస్తున్నారు.

ఇక ర‌జ‌నీకాంత్ (Rajinikanth) లాంటీ సూప‌ర్ స్టార్ ప‌క్క‌న న‌టించే అవ‌కాశం కొంద‌రికే వ‌స్తుంది. అలాంటి అవకాశం వ‌స్తే వ‌దులుకోలేక ర‌జ‌నీకాంత్ సినిమాలో చెల్లెలుగా చేయ‌డానికి ఒప్పుకున్నాను.  అలాగే చిరంజీవి లాంటి స్టార్ హీరోతో కూడా చెల్లెలుగా న‌టిస్తున్నాని కీర్తి సురేష్ చెప్పారు. త‌మిళ్ సినిమా అన్నాత్తైలో కీర్తి సురేష్ ర‌జ‌నీకాంత్ పెద్ద చెల్లిగా న‌టిస్తున్నారు. తెలుగులో పెద్ద‌న్న‌గా ఈ సినిమా రిలీజ్ కానుంది. చిరంజీవి న‌టిస్తున్న భోళా శంకర్‌లో కీర్తి చిరుకు చెల్లిగా చేసేందుకు ఒప్పుకున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!