Mrunal Thakur: 'సీతా రామం'లో సీత పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నా: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మృణాల్ ఠాకూర్..!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం' (Sitaramam). అక్కినేని సుమంత్,స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) తెరకెక్కించగా, వైజయంతి మూవీస్ నిర్మించింది.
'సీతారామం' (Sitaramam Release Date) శుక్రవారం (ఆగస్టు 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'సీతారామం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) మాట్లాడుతూ.. "సీత పాత్రకి న్యాయం చేశానని నమ్ముతున్నా. ఈ పాత్రని చాలా బాధ్యతగా చేశా. థియేటర్‌లో కూర్చుంటే రామ్, సీత ప్రపంచంలోకి వెళ్లిపోతారంతా. కథలుంటాయి, ప్రేమకథలుంటాయి. వాటిని మించిందీ చిత్రం" అని అన్నారు. సీతా రామంలో సీత పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి నటికి సీత పాత్ర చేయాలనే డ్రీమ్ ఉంటుంది. నేను ధైర్యంగా చెబుతున్నా. ఇది నా పుట్టినరోజు గిఫ్ట్‌గా భావిస్తున్నాని పేర్కొంది.
రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించిడం ఎలా ఉందని అడిగిన ప్రశ్నకు.. సీతారామం ఇండియన్ సినిమాలో బేక్ త్రూ అవుతుందని తెలిపింది. నాకు కథక్ అంటే ఇష్టం. ఇందులో కొరియోగ్రాఫర్ బృందగారు చాలా ఎక్సెప్రెషన్స్ చూపించారు. ఇది రొమాంటిక్ ప్రాజెక్ట్. సీతారామంలో నా పాత్రలో ఐదు షేడ్స్ ఉంటాయి. కెరీర్‌లో అరుదుగా వచ్చే పాత్ర ఇది. దుల్కర్ సల్మాన్‌తో (Dulquer Salman) నటించడం చాలా ఆనందంగా ఉంది అని వివరించింది మృణాల్ ఠాకూర్.
Read More: 'సీతారామం' (Sitaramam) చాలా ఒరిజినల్ కథ... క్లాసిక్ మూవీ.. దుల్కర్ సల్మాన్ కీలక వ్యాఖ్యలు!