వెండితెర‌పైకి మ‌రో యువ‌ రాజ‌కుమారుడు(Yuva Rajkumar)

Updated on Apr 27, 2022 11:07 AM IST
 హోంబ‌లే ఫిలిమ్స్ (Hombale Films) లేటెస్ట్ ట్వీట్ పోస్ట్ అంద‌రినీ ఆశ్చ‌ర్య పరిచింది. ఓ యువ  రాజ‌కుమారుడు(Yuva Rajkumar)ని వెండితెర సింహాస‌నం ఎక్కిస్తున్నామంటూ సస్పెన్స్ రివీల్ చేసింది.
హోంబ‌లే ఫిలిమ్స్ (Hombale Films) లేటెస్ట్ ట్వీట్ పోస్ట్ అంద‌రినీ ఆశ్చ‌ర్య పరిచింది. ఓ యువ రాజ‌కుమారుడు(Yuva Rajkumar)ని వెండితెర సింహాస‌నం ఎక్కిస్తున్నామంటూ సస్పెన్స్ రివీల్ చేసింది.

హోంబ‌లే ఫిలిమ్స్ (Hombale Films) లేటెస్ట్ ట్వీట్ పోస్ట్ అంద‌రినీ ఆశ్చ‌ర్య పరిచింది. ఓ రాజ‌కుమారుడుని వెండితెర సింహాస‌నం ఎక్కిస్తున్నామంటూ సస్పెన్స్ రివీల్ చేసింది. హోంబ‌లే ఫిలిమ్స్  కొత్త సినిమాలో క‌నిపించ‌బోయే రాజ‌కుమారుడు ఎవ‌రో తెలుసుకుందాం..

హోంబ‌లే ఫిలిమ్స్(Hombale Films) క‌న్న‌డ సినిమాకి చెందిన‌ బ‌డా నిర్మాణ సంస్థ‌. కేజీఎఫ్ సినిమాలు తీయ‌డంతో ప్ర‌పంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది. సీనియ‌ర్ న‌టుడు, సింగ‌ర్ డాక్ట‌ర్ రాజ్‌కుమార్ మ‌నువ‌డు యువ రాజ్‌కుమార్‌(Yuva Rajkumar)ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేస్తుంది. యువ రాజ్‌కుమార్ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. యువ రాజ్‌కుమార్‌కు మంచి భ‌విష్య‌త్తు ఉండాల‌ని కోరుకుంటూ.. వార‌సత్వం కొన‌సాగాల‌ని ట్వీట్ చేసింది. 

 

(Yuva Rajkumar)

ప్ర‌ముఖ క‌న్న‌డ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(Puneeth Rajkumar)  అన్న‌య్య రాఘ‌వేంద్ర‌రావు రాజ్‌కుమార్ కుమారుడే యువ రాజ్ కుమార్. పునీత్ రాజ్‌కుమార్ ఎంత పెద్ద స్టారో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.. ఇటీవ‌లే పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో చిన్న వ‌య‌సులోనే చ‌నిపోయారు. వార‌స‌త్వ న‌ట‌న‌ను కొన‌సాగించేందుకు పునీత్ లేని లోటు తీర్చేందుకు యువ రాజ్‌కుమార్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!