Charmme Kaur: హీరోయిన్, నిర్మాత చార్మీ కౌర్ ఆస్తి అన్ని కోట్ల రూపాయలు ఉంటుందా?

Updated on Aug 18, 2022 09:45 PM IST
హీరోయిన్ చార్మీ కౌర్ (Charmme Kaur) ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నారు
హీరోయిన్ చార్మీ కౌర్ (Charmme Kaur) ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నారు

తెలుగు సినిమాల ద్వారా అరంగేట్రం చేసినప్పటికీ మొదట హిందీ, తమిళ, మలయాళ  సినిమాల్లో నటించారు చార్మీ కౌర్ (Charmme Kaur). 'గౌరి' 'మాస్' 'అనుకోకుండా ఒక రోజు' 'లక్ష్మి' 'స్టైల్' 'మంత్ర' వంటి హిట్ చిత్రాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించి మెప్పించారు.

తన అందం, నటన, డ్యాన్స్‌తో సినిమాల్లో రాణించిన చార్మి.. ప్రస్తుతం నిర్మాతగా మారారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో చార్మి కొనసాగుతున్నారు. ఈ సమయంలో చార్మి ఎంత సంపాదించి ఉంటే ఆమె నిర్మాతగా మారారు అని చాలా మంది అనుకుంటున్నారు.

హీరోయిన్ చార్మీ కౌర్ (Charmme Kaur) ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నారు

మొత్తంగా 3 ఫ్లాట్లు..

చార్మి హీరోయిన్‌గా ఉన్న సమయంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ‘గోల్డ్‌ ఎడ్జ్‌’ అపార్ట్‌మెంట్స్‌లో ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు చార్మి. అలాగే ముంబైలో కూడా రెండు ప్లాట్లను కొన్నారు. అంతేకాదు చార్మి గ్యారేజీలో వందల కోట్ల విలువ చేసే కార్లు కూడా ఉన్నాయని సమాచారం. చార్మి హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో ఒక్కో సినిమాకు సుమారుగా రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు రెమ్యునరేషన్‌ తీసుకునే వారని టాక్.

ఇప్పుడు డాషింగ్‌ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి ఛార్మి నిర్మించే సినిమాల విషయంలో..

ఆమెకు రెమ్యునరేషన్‌తోపాటు  లాభాల్లో వాటాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. 'మెహబూబా' చిత్రానికి పూరీ, ఛార్మీ ఇద్దరికీ నష్టాలు వచ్చాయి. ఆ ఒక్క సినిమాకి తప్ప వీరు నిర్మించిన సినిమాలకు దాదాపు లాభాలు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మొత్తంగా చార్మి (Charmme Kaur) ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ 20 సంవత్సరాలలో రూ.100 కోట్లకు పైనే సంపాదించారని టాక్. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలీదు.

 Read More : Liger : ‘లైగర్’ చిత్రాన్ని ఆ సినిమాతో పోల్చవద్దు, టైసన్ నాకు ఫ్రెండ్ .. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!