ప్ర‌భాస్‌తో(Prabhas) క‌లిసి న‌టించే ద‌మ్ముందా? 

Updated on Apr 22, 2022 06:29 PM IST
డార్లింగ్ ప్ర‌భాస్‌తో న‌టించేందుకు అవ‌కాశం అట‌, మార్షల్ ఆర్ట్స్, స్టంట్స్‌తో మెప్పిస్తే ప్ర‌భాస్‌తో క‌లిసి యాక్ట్ చేసేయ‌వ‌చ్చు. పార్ వ‌ర‌ల్డ్ స్టార్‌గా నిలిచేందుకు ప్ర‌భాస్ ప్లాన్ చేశారా?

పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ సినిమా అంటే ఓ రేంజ్‌లో ఉంటుంది. 'రాధేశ్యామ్'  హిట్  కాక‌పోవ‌డానికి కార‌ణాలు ఏవైనా.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ప‌లు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. మ‌ళ్లీ త‌న రేంజ్ ఏంటో చూపించేందుకు డార్లింగ్ హార్డ్‌వ‌ర్క్ చేస్తున్నారు.

Hero Prabhas

కేజీఎఫ్2 తో సెన్సేష‌న‌ల్  డైరెక్ట‌ర్ అయిన ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ 'స‌లార్' సిన‌మా చేస్తున్నారు. మ‌రో ప్రాజెక్టు
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో 'ఆది పురుష్' సినిమాతో బిజీగా ఉన్నారు డార్లింగ్. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో  'ప్రాజెక్ట్ కే' సినిమా కూడా చేస్తున్నారు. 

Hero Prabhas

ప్ర‌భాస్ సినిమా కోసం మంచి స్టంట్ మాస్ట‌ర్ వేట‌లో ప‌డింది 'ప్రాజెక్ట్ కే' యూనిట్. ఎవ‌రైనా డిఫెరెంట్ స్టంట్స్ చేయ‌గ‌లిగితే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని కోరింది. టాలెంట్ ఉంటే ప్ర‌భాస్ సినిమాలో అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు. ఈ సినిమాలో ఎక్కువ‌గా ఇండియ‌న్స్  న‌టులు ఉండేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. 

Hero Prabhas

బాలీవుడ్ టాప్ న‌టుడు అమితాబచ్చన్ కూడా ప్ర‌భాస్ మూవీలో కీ రోల్ పోషిస్తున్నార‌ట‌. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై కే టైటిల్‌తో సినిమా తీసున్నారు. కే అంటే కల్కి అవతారం అని టాక్. ప్ర‌భాస్ ప్రాజెక్టులు చూస్తుంటే పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ అయ్యేందుకు ప్లాన్ చేశారేమే అనిపిస్తుందని సినీ ప్ర‌ముఖులు అంటున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!