Shekar (శేఖర్) : రాజశేఖర్ సినిమాలోని "ఫాదర్" సాంగ్‌ను రిలీజ్ చేసిన ప్రభాస్ !

Updated on May 22, 2022 03:37 PM IST
Shekar Movie: డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ కొత్త సినిమా శేఖ‌ర్ నుంచి స‌త్యం శివం సుంద‌రం పాట రిలీజ్ అయింది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ శేఖ‌ర్ మూవీలో ఫాద‌ర్ సాంగ్ రిలీజ్ చేశారు.
Shekar Movie: డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ కొత్త సినిమా శేఖ‌ర్ నుంచి స‌త్యం శివం సుంద‌రం పాట రిలీజ్ అయింది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ శేఖ‌ర్ మూవీలో ఫాద‌ర్ సాంగ్ రిలీజ్ చేశారు.

డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ కొత్త సినిమా "శేఖ‌ర్" నుండి "స‌త్యం శివం సుంద‌రం" అనే పాట ఇటీవలే రిలీజ్ అయింది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఈ పాటను రిలీజ్ చేశారు. ల‌లిత్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న 'శేఖ‌ర్' సినిమాలో.. రాజశేఖ‌ర్ కూతురు 'శివానీ రాజ‌శేఖ‌ర్' కూడా న‌టిస్తున్నారు. 

'శేఖ‌ర్' చిత్రం మే 20న విడుద‌ల కానుంది. అను సితార, ముస్కాన్ ఖుబ్‌చందానీలు ఈ సినిమాలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. జీవితా రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాజ‌శేఖ‌ర్ కూతుళ్లు శివానీ, శివాత్మికలు ప్రొడ్యూస‌ర్లుగా వ్యవహరిస్తున్నారు.  

ప్ర‌స్తుతం రిలీజ్‌కు సిద్దంగా ఉన్న 'శేఖ‌ర్' సినిమా నుంచి స‌త్యం శివం సుంద‌రం అనే పాట‌ను ప్ర‌భాస్ రిలీజ్ చేశారు. ఈ 'ఫాద‌ర్' సాంగ్‌ నాన్న ప్రేమను గురించి తెలిపే ఓ ప్రత్యేక గీతం.  ఈ పాటను విడుదల చేసిన ప్రభాస్, మూవీ మేకర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలోని పాటలకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.  'ఫాద‌ర్' అనే  పాట‌ను విజయ్ యేసుదాస్, ఉమా నేహాలు పాడారు.

'శేఖ‌ర్' చిత్రంలో శివానీ రాజశేఖర్, ప్రకాష్ రాజ్, ముస్కాన్ కుబ్చంధాని, ఆత్మీయ రాజన్, అభినవ్ గోమతం, సమీర్, భరణి తదితరులు కీలక పాత్రల్లో న‌టించారు. లక్ష్య ప్రొడక్షన్స్ అండ్ పెగాసస్ సినీ కార్ప్‌పై MLV సత్యనారాయణ, శివాని, శివాత్మిక & వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాత‌లుగా 'శేఖ‌ర్' సినిమాను నిర్మించారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!