ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శక ధీరుడని ముందే తెలుసు : భాను చందర్
ఆర్.ఆర్.ఆర్. సినిమాతో రాజమౌళి (Rajamouli) తన టాలెంట్ ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. రాజమౌళి డైరెక్షన్ టాలెంట్ గురించి తనకు ముందే తెలుసని భానుచందర్ అన్నారు. దేశం గర్వించదగ్గ డైరెక్టర్ రాజమౌళి అంటూ భానుచందర్ పొగిడారు.
తెలుగు సినిమా దర్శకుడు రాజమౌళి(Rajamouli) తీసిన సినిమా ఆర్.ఆర్.ఆర్. బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ప్రతీ ఒక్కరూ ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఇద్దరూ టాప్ హీరోలే.. అలాంటి హీరోలతో ఓ యోధుల కథ తెరకెక్కించడం మామూలు విషయం కాదంటున్నారు.
సీనియర్ హీరో భానుచందర్ రాజమౌళి దర్వకత్వం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి గొప్పతనం ఏంటో తెలిపారు. రాజమౌళి (Rajamouli) దేశం గర్వంచ దగ్గ దర్శకుడు అవుతాడని 12 ఏళ్ల క్రితమే చెప్పానని భానుచందర్ గుర్తుచేసుకున్నారు. సింహాద్రి సినిమా డబ్బింగ్ కోసం వెళ్లినప్పుడు రాజమౌళిని పిలిచి 'నువ్వు ఓ గొప్ప డైరెక్టర్ అవుతావు' అని చెప్పానన్నారు.
సినిమా ఎలా తీయాలి.. ఎలా ప్రమోట్ చేయాలి... ఎలా హిట్ చేయాలనే టెక్నిన్స్ రాజమౌళికి బాగా తెలుసని అన్నారు. మట్టిని చాక్లెట్ పేపర్‌లో చుట్టి వండర్‌ఫుల్ చాక్లెట్ అని చెప్పి రాజమౌళి అమ్మగలిగే సత్తా ఉన్న దర్వకుడని పొగిడారు.
సినిమా మార్కెటింగ్ చేయడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా అని భానుచందర్ చెప్పుకొచ్చారు. బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నను జనాల్లోకి బాగా తీసుకెళ్లారు రాజమౌళి.. జవాబు కోసం థియేటర్లకు పోటెత్తారు జనాలు.. ఇది జకన్న టాలెంట్. రాజమౌళి సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తారని భానుచందర్ అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాలో భానుచందర్ నటించారు. హీరోయిన్ భూమికకు తండ్రిగా చేశారు. సింహాద్రి రాజమౌళి(Rajamouli) రెండో సినిమా. రాజమౌళి, ఎన్టీఆర్‌ల కేరీర్‌లో సూపర్ హిట్ ఇచ్చిన సినిమా ఇది. సింహాద్రి సినిమా చేస్తున్నాప్పుడే రాజమౌళి దర్శక ధీరత్వం దగ్గరగా చూసానని భానుచందర్ చెప్పారు.