మాస్ లుక్‌లో అదరగొడుతున్న హీరో సత్యదేవ్ (Satya Dev).. యాక్షన్‌ డ్రామాగా ‘కృష్ణమ్మ’ ట్రైలర్‌‌

Updated on Aug 06, 2022 02:17 PM IST
మొదటిసారి ఫుల్ మాస్ గెటప్‌లో సత్యదేవ్ (Satya Dev)
మొదటిసారి ఫుల్ మాస్ గెటప్‌లో సత్యదేవ్ (Satya Dev)

విభిన్నమైన క్యారెక్టర్లను సెలెక్ట్‌ చేసుకుంటూ.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు సత్యదేవ్ (Satya Dev). ఇటీవలే 'గాడ్సే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆయన. గతంలో బ్లఫ్ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య లాంటి సినిమాలు సత్యదేవ్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి.  సత్య దేవ్‌ నటించిన సినిమా వస్తుందంటే.. ఏదో ఒక కొత్తదనం అందులో కచ్చితంగా ఉంటుందని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు.

ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, సినిమా ఇండస్ట్రీలోకి అడ‌గుపెట్టి తన టాలెంట్‌తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు సత్యదేవ్. ప్రస్తుతం సత్యదేవ్‌ నాలుగు సినిమాలు చేస్తున్నారు. వాటిలో 'కృష్ణమ్మ' సినిమా కూడా ఒకటి. 'కృష్ణమ్మ' సినిమాతో మంచి విజయాన్ని  అందుకోవాలని చూస్తున్నారు.

తన కెరీర్‌‌లోనే తొలిసారిగా పూర్తి స్థాయి యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సత్యదేవ్. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్న' కృష్ణమ్మ' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌‌ను సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశారు.

మొదటిసారి ఫుల్ మాస్ గెటప్‌లో సత్యదేవ్ (Satya Dev)

ఇంట్రెస్టింగ్‌గా..

‘ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో, ఎలా పుట్టామో, ఎవ్వడికీ తెలియ‌దు. ఎప్పుడు పుట్టినా, ఎలా పుట్టినా, పుట్టిన ప్రతి ఒక్కడికీ ఏదో ఒక క‌థ ఉండే ఉంటుంది. క‌థ న‌డ‌క‌, న‌ది న‌డ‌క ప్రశాంతంగా సాగిపోవాలంటే.. ఎవ్వడూ గెలక్కూడ‌దు. కానీ గెలికారు’ అంటూ సత్యదేవ్ చెప్పే డైలాగులు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. 

'కృష్ణమ్మ' సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ప్రేక్షకులకు సినిమాపై అంచనాలను బాగానే పెంచేశాయి. ఇప్పుడు రిలీజైన టీజర్‌‌ సైతం సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచేసింది. కృష్ణమ్మ సినిమాలో సత్యదేవ్‌కు (Satya Dev) జోడీగా అతిరా రాజీ నటిస్తున్నారు.

Read More : Godse Movie: 'గాడ్సే' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!