Siri Hanumanthu: ప్రియుడు శ్రీహన్ (Shrihan)తో కలిసి లగ్జరీ కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంతు..!

Updated on Jul 14, 2022 09:40 PM IST
సిరి హన్మంతు, శ్రీహన్ (Shrihan, Siri Hanumanthu)
సిరి హన్మంతు, శ్రీహన్ (Shrihan, Siri Hanumanthu)

Siri Hanumanthu: సిరి హన్మంతు.. తెలుగు బిగ్‌బాస్‌ రియాల్టీ షో రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లకు పరిచయం అవసరం లేని పేరు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, బుల్లితెరపై సీరియల్స్ తో అంతకుముందే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో ఛాన్స్ కొట్టేసి మరింత బాగా పాపులర్ అయింది. బిగ్‌బాస్‌ సీజన్ 5లో మరో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి రచ్చ రచ్చ చేసి బాగా వైరల్ అయింది. 

ఒకరకంగా షణ్ముఖ్ (Shanmukh Jaswanth), దీప్తి విడిపోవడానికి సిరినే కారణం అని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత సిరి తన ప్రియుడు శ్రీహన్  తో కూడా విడిపోయింది అని పుకార్లు షికార్లు చేశాయి. దీంతో చాలా రోజులు వార్తల్లో నిలిచింది సిరి హన్మంత్. దీనికి తోడు శ్రీహన్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో సిరి ఫొటోలను మరియు వీడియోలను తొలగించడం వల్ల ఇది నిజమే అని అందరూ నమ్మేశారు. ఈ నేపథ్యంలోనే సిరి.. తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలను తాజాగా షేర్ చేసి వాళ్ళ బంధంపై క్లారిటీ ఇచ్చింది. సిరి హన్మంతు, శ్రీహన్‌ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించగానే ఆ పుకార్లన్నీ నిజంగా కావని తెలుస్తోంది. 

తాజాగా సిరి హనుమంతు (Siri Hanumanthu) తనకు ఎంతో ఇష్టమైన ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసింది. 16 లక్షల విలువైన MG కారును ఇటీవల సిరి హనుమంత్ హైదరాబాదులో కొనుగోలు చేసింది. ఎప్పటి నుంచో ఈ కారును ఆమె కొనాలని అనుకుంటుందట. ఇక ఫైనల్ గా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి అమ్మడు మొదటి కారును కొన్న సందర్భంగా ప్రత్యేకంగా ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

ఇక, సిరి.. కారుని కొనేటప్పుడు తన ప్రియుడు శ్రీహన్ (Shrihan) కూడా పక్కనే ఉన్నాడు. వీరిద్దరూ కలిసి కార్ కీస్ ని అందుకున్నారు. ఆ తర్వాత ప్రియుడితో కలిసి కార్ వద్ద ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీహాన్‌ కూడా సిరి కొత్త కారు కొన్న ఫోటోలని పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ.. ముందు డ్రైవింగ్‌ నేర్చుకో సిరి అంటూ సరదాగా కౌంటర్‌ వేశాడు. ఇదిలా ఉంటే.. సిరికి పలువురు నెటిజన్లు, ప్రముఖులు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెప్తున్నారు.

Read More: Biggboss Season6: త్వరలో బిగ్ బాస్ సీజన్ 6.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!