ఎత్త‌ర జెండా పాట‌కు రాజ‌మౌళి(Rajamouli) స్టెప్పులు

Updated on Apr 26, 2022 07:21 PM IST
ఆర్.ఆర్.ఆర్ సినిమా నుంచి ఎత్త‌ర జెండా సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ అయింది. ఎత్త‌ర జెండా పాట‌లో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి (Rajamouli) స్టెప్పులు అద‌ర‌గొట్టారు. రాజ‌మౌళితో పాటు ఈ పాట‌లో ఎవ‌రున్నారంటే...
ఆర్.ఆర్.ఆర్ సినిమా నుంచి ఎత్త‌ర జెండా సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ అయింది. ఎత్త‌ర జెండా పాట‌లో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి (Rajamouli) స్టెప్పులు అద‌ర‌గొట్టారు. రాజ‌మౌళితో పాటు ఈ పాట‌లో ఎవ‌రున్నారంటే...

Rajamouli

ఆర్.ఆర్.ఆర్ సినిమా నుంచి ఎత్త‌ర జెండా సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ అయింది. ఎత్త‌ర జెండా పాట‌లో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి (Rajamouli) స్టెప్పులు అద‌ర‌గొట్టారు. రాజ‌మౌళితో పాటు ఈ పాట‌లో ఎవ‌రున్నారంటే...

రాజ‌మౌళి(Rajamouli)  సినిమాను ఎలా హిట్ చేయాలో బాగా తెలుస‌ని సీనియ‌ర్ హీరో భానుచంద‌ర్ అన్నారు. సినిమా ఎలా ప్ర‌మోట్ చేయాలో రాజ‌మౌళికి బాగా తెలుస‌ని భానుచంద‌ర్ చెప్పారు.ఇప్పుడు అవే మాట‌లు అక్ష‌రాల నిజం చేసి చూపించారు రాజ‌మౌళి. ఎత్త‌ర జెండా పాట‌ను ఆర్.ఆర్.ఆర్. సినిమాలో చివ‌రిలో యాడ్ చేశారు. ఇప్పుడు ఎత్త‌ర జెండా పాట‌ను స‌రికొత్త‌గా రిలీజ్ చేశారు. 

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్, ఆలియా భ‌ట్ యాక్ట్ చేశార‌నుకున్న ఎత్త‌ర జెండా పాట‌లో ఓ స‌ప్రైజ్ ఎలిమెంట్ యాడ్ చేశారు. రాజ‌మౌళి కూడా ఆ పాట‌లో యాక్ట్ చేశారు. రాజ‌మౌళి(Rajamouli) ని ఎత్త‌ర జెండా పాట‌లో చూసిన అభిమానులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ త‌ర్వాత రాజ‌మౌళి డాన్స్ చూసి ఎంజాయ్ చేశారు. 

 

బాలీవుడ్ న‌టుడు అజ‌య్‌దేవ‌గ‌ణ్‌తో పాటు ఒలివియా మోరిస్ కూడా ఎత్త‌ర జెండా పాట‌కు స్టెప్పులేశారు. రాజ‌మౌళి యాక్ట్ చేసిని ఎత్త‌ర జెండా ఫుల్ వీడియో రిలీజ్ అయి ల‌క్ష‌ల వ్యూస్‌లో దూసుకుపోతుంది. రామ జోగయ్య శాస్త్రీ రాసిన ఈపాటకు ఎమ్‌ ఎమ్‌ కీరవాణి సంగీతం అందించారు. విశాల్‌ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హారిక నారాయణ్‌లు పాడారు. ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ కాన్సెప్ట్‌ డిజైన్ చేశారు. హరిశ్‌ కొరియోగ్రఫీ అందించాడు.

ఎత్త‌ర జెండా కొత్త వీడియో సాంగ్ తెలుగు, హాందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం 
ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్‌ రాబడ‌తూ ట్రెండ్ సృష్టిస్తుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!