Dr. Rajasekhar: రాజ "శేఖ‌ర్" మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌

Updated on May 05, 2022 05:34 PM IST
హీరో రాజ‌శేఖ‌ర్ స్మైల్‌తోనే అభిమానుల‌ను సంపాదించుకున్నారు. విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న రాజ‌శేఖ‌ర్ సొంతం. ప్ర‌స్తుతం శేఖ‌ర్ అనే మూవీలో న‌టిస్తున్నారు. రాజ‌శేఖ‌ర్‌(Dr. Rajasekhar)తో పాటు త‌న పెద్ద కూతురు కూడా శేఖ‌ర్ సినిమాలో న‌టిస్తున్నారు. 

యాంగ్రీమ్యాన్ రాజ‌శేఖ‌ర్ (Dr. Rajasekhar) పీవీఎస్ గ‌రుడ‌వేగ‌, క‌ల్కి సినిమాల త‌ర్వాత వ‌స్తున్న సినిమా శేఖ‌ర్. క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ల‌లిత్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న శేఖ‌ర్ సినిమాలో రాజ‌శేఖ‌ర్ పెద్ద కూతురు శివానీ రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్నారు. తండ్రి కూత‌ళ్లు క‌లిసి న‌టిస్తున్న మొద‌టి సినిమా కూడా ఇదే. శేఖ‌ర్ సినిమా ట్రైల‌ర్‌ను అడ‌వి శేషు రిలీజ్ చేశారు. 

జీవితా రాజ‌శేఖ‌ర్ కూడా  శేఖ‌ర్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కూతుళ్లు శివానీ, శివాత్నిక‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  హీరో రాజ‌శేఖ‌ర్ చేస్తున్న 91 వ సినిమాగా శేఖ‌ర్ విడుద‌ల కానుంది. శేఖ‌ర్ సినిమాలో రాజ‌శేఖ‌ర్‌(Dr. Rajasekhar)కు జోడిగా ముస్కాన్ కూబ్ చాందిని న‌టిస్తున్నారు. 

ShekarTrailer

శేఖ‌ర్ సినిమాలో ఓ పోలీస్ ఆఫీస‌ర్‌గా రాజ‌శేఖ‌ర్ క‌నిపిస్తున్నారు. ఇన్వెస్టిగేష‌న్  క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు. మే 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రాజశేఖర్  కిరణ్ అనే డైరెక్టర్‌తో క‌లిసి మ‌రో సినిమా చేస్తున్నారు.  సస్పెన్స్ థ్రిల్లర్ క‌థ‌ను కిర‌ణ్ తీస్తున్నారు. మ‌రో చిత్రం మ‌ర్మాణువు వెంక‌టేష్ మ‌హా ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. మిక్కి జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు. మ‌ర్మాణువు సినిమా కూడా రాజ‌శేఖ‌ర్ (Dr. Rajasekhar)నిర్మిస్తున్న సినిమానే. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!