80 ఏళ్ల వయసులో ‘ప్రేమలేఖ’ రాసిన డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు (K.Raghavendra Rao).. నేడు దర్శకేంద్రుడి పుట్టినరోజు

Updated on May 24, 2022 10:30 AM IST
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K.Raghavendra Rao)
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K.Raghavendra Rao)

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు (K.Raghavendra Rao) ఈ పేరు చెబితే ఆయన తీసిన పాటలు చాలామందికి గుర్తుకు వస్తాయి. ఆ పాటల్లో హీరోయిన్స్‌ను అందంగా, గ్లామర్‌‌గా చూపించడంలో ఆయనకు ఆయనే సాటి. రాఘవేంద్రరావు సినిమాల్లో నటించాలని చాలా మంది హీరోయిన్లు కోరుకుంటారు. ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా చాన్స్‌ కోసం స్టార్ హీరోయిన్లు సైతం వేచి చూస్తారంటే రాఘవేంద్ర రావు రేంజ్ ఏంటో మనకి అర్ధమవుతుంది. హీరోయిన్లను అందంగా చూపించడంతోపాటు, పాటకు దర్శకత్వం చేయడంలో ఆయన తీసుకునే శ్రద్ధ అటువంటిది మరి.

హీరోయిన్లను అందంగా చూపించడం, ప్రేమ గీతాలు తీయడమే కాదు, భక్తి ప్రధాన సినిమాలు తీయడంలో కూడా రాఘవేంద్రరావుకు సాటి దర్శకుడు మరొకరు ఉండరంటే నమ్మక తప్పదు. మన్మధుడు నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘అన్నమయ్య’ సినిమానే దానికి నిదర్శనం. ఇక, మెగాస్టార్‌‌ను శివుడిగా, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ను శ్రీమంజునాథ సినిమాలో శివ భక్తుడిగా ఆయన చూపించిన తీరు అద్భుతం. అన్నమయ్య తర్వాత చాలా కాలానికి నాగార్జునతో శ్రీరామదాసు, షిరిడిసాయి సినిమాలకు దర్శకత్వం వహించి కింగ్ నాగార్జునను భక్త రామదాసుగా, షిరిడి సాయి బాబాగా చూపించి సినీ ప్రేమికులతోపాటు నాగార్జున అభిమానులను కూడా మెప్పించారు రాఘవేంద్రరావు.

రాఘవేంద్రరావు తీసిన పలు సినిమా పాటల్లోని ఫోటోలు

మే 23న రాఘవేంద్రరావు 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా తన జన్మదినానికి ఉన్న ప్రత్యేకతను ఆయన ఒక లేఖ ద్వారా వివరించారు. 'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ' అనే పుస్తకాన్ని రాసినట్లు పేర్కొన్నారు రాఘవేంద్రరావు. ఈ పుస్తకంలోని పలు విషయాలను ఆయన తెలియజేశారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..  

దర్శకుడిగా వందకుపైగా సినిమాలకు దర్శకత్వం వహించాను. ఆ అనుభవంతో ఒక పుస్తకాన్ని రాశాను. 1963వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ నాకు గుర్తుంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌పై తొలిసారి క్లాప్‌ కొట్టడంతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నా సినిమా కెరీర్ స్టార్ట్ అయ్యింది. దాదాపు పది సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా పనిచేసిన తర్వాత మా నాన్నగారు కేఎస్‌ ప్రకాశరావు గారు సమర్పించిన ‘బాబు’ సినిమాతో దర్శకుడిగా మొదటి సినిమా తీశాను

ఆ రోజు నుంచి మొదలైన నా 48 ఏళ్ల సుదీర్ఘ దర్శకత్వ సినీ ప్రయాణంలో.. ఎన్నో విజయాలు, అపజయాలు, ఎత్తులు, లోతులు అవార్డులు, రివార్డులు. అందుకే 80 ఏళ్ల నా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్ధేశంతో ‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’ అంటూ నా చేతులతోనే ఒక పుస్తకం రాసుకున్నాను. ఆ పుస్తకంలో నేను నడిచిన సినిమా దారిలో ఎంతోమంది స్నేహితులు, బంధువులు, ఆప్తులు, నన్ను నమ్మి నాతో పాటు నడిచిన నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, రచయితలతో పాటు ఎంతోమందిని గుర్తు చేసుకోవాలని అనుకున్నాను. అనుభవం నేర్పిన కొన్ని విషయాలను రాయాలనిపించింది. అందుకే నా ఈ ప్రేమలేఖల్ని మీ ముందు ఉంచుతున్నాను. 

ఇటీవల వచ్చిన ‘పెళ్లిసందD* సినిమాలో రాఘవేంద్ర రావు

నా ఈ ఉన్నత స్థితికి కారణమైన సినిమా రంగంలోని 24 శాఖల వాళ్లకు.. ముఖ్యంగా ప్రేక్షకులకి నా గురించి, నేను నేర్చుకున్న పాఠాల గురించి ‘అబద్దాలు రాయటం అనర్ధం, నిజాలు రాయటానికి భయం.. అంటూ మనసు పెన్‌తో రాశాను, ఓపెన్‌గా రాశాను. ఏదీ కప్పి చెప్పలేదు. విప్పి చెప్పలేదు. కొంచెం తీపి, కొంచెం కారం, కొంచెం..... . చివరగా నేను చెప్పేదొక్కటే ‘సినిమా అనేది ఇలానే ఉండాలి అనే గీత గీయకూడదు, ఇలా కూడా ఉండొచ్చు అని ఈ మధ్య విడుదలైన చాలా సినిమాలు నిరూపించాయి. ఈ పుస్తకం ప్రతి పుస్తకాలయాల్లో దొరుకుతుంది. పాఠలకులందరూ పుస్తకాన్ని చదివి ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. మీ కె.రాఘవేంద్రరావు (K.Raghavendra Rao) అని ముగించారు.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య

రాఘవేంద్రరావు తీసిన సినిమాల్లో కొన్ని..

బాబు, జ్యోతి, రాజా, అడవి రాముడు, పదహారేళ్ల వయసు, డ్రైవర్‌‌ రాముడు, వేటగాడు, భలే కృష్ణుడు, ఘరానా దొంగ, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, గజ దొంగ, ఊరికి మొనగాడు, తిరుగు లేని మనిషి, సత్యం శివం, ప్రేమ కానుక, కొండవీటి సింహం, త్రిశూలం, జస్టిస్ చౌదరి, దేవత, శక్తి, బొబ్బిలి బ్రహ్మన్న, ఇద్దరు దొంగలు, పట్టాభిషేకం, అడవి దొంగ, అగ్ని పర్వతం, వజ్రాయుధం, అపూర్వ సహోదరులు, కలియుగ పాండవులు, రావణ బ్రహ్మ, కొండవీటి రాజా, భారతంలో అర్జునుడు, జానకి రాముడు, మంచి దొంగ, ఆఖరి పోరాటం, ఒంటరి పోరాటం, అల్లుడుగారు, జగదేకవీరుడు అతిలోక సుందరి, కూలీ నెం.1, సుందరకాండ, అల్లరి మొగుడు, ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, ముద్దుల ప్రియుడు, ఘరానా బుల్లోడు, బొంబాయి ప్రియుడు, పెళ్లి సందడి, అన్నమయ్య, పరదేశి, ఇద్దరు మిత్రులు, రాజకుమారుడు, శ్రీ మంజునాథ, గంగోత్రి, శ్రీ రామదాసు, షిరిడి సాయి,  ఓం నమో వేంకటేశాయ

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీమంజునాథ

రాఘవేంద్ర రావుకు లభించిన అవార్డులు

ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, బీఎన్ రెడ్డి లైఫ్‌ టైమ్ అవార్డు ఫర్ తెలుగు సినిమా, అన్నమయ్య, పెళ్లిసందడి, అల్లరి ప్రియుడు, బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలకు బెస్ట్‌ డైరెక్టర్ అవార్డు, ప్రేమలేఖలు, జగదేక వీరుడు అతిలోక సుందరి, అల్లరి ప్రియుడు, అన్నమయ్య సినిమాలకు బెస్ట్‌ డైరెక్టర్‌‌గా సౌత్‌ ఫిల్మ్‌ ఫేర్‌‌ అవార్డులు, ఇండియన్ సినిమాకు చేసిన సేవలకుగాను 2017 ఐఐఎఫ్‌ఏ అవార్డు, 2014లో సైమా లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ అవార్డు, 2013లో షిరిడిసాయి సినిమాకు బెస్ట్ ఫిల్మ్ (జ్యూరీ) అవార్డు, 2016లో అల్లు రామలింగయ్య అవార్డు.

జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు గాను లైఫ్‌ టైమ్ అవార్డు అందుకుంటున్న రాఘవేంద్రారావు

అల్లు రామలింగయ్య అవార్డు అందుకుంటున్న రాఘవేంద్రరావు

 
 
శతాధిక చిత్ర దర్శకుడు, నిర్మాత, కొరియోగ్రాఫర్, స్క్రీన్‌ రైటర్‌‌ కె.రాఘవేంద్రరావు గారికి పింక్‌విల్లా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Happy Birthday To Legendary Director K.Raghavendra Rao
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!