తెలుగు హీరోల‌ను ఫాలో చేస్తున్న‌ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ (David Warner)

Updated on May 14, 2022 11:57 AM IST
 క్రికెట‌ర్ డేవిడ్ వార్నర్ (David Warner) చిరంజీవి ఫేస్‌ను మార్ఫ్ చేసి ఓ వీడియోను రిలీజ్ చేశాడు
క్రికెట‌ర్ డేవిడ్ వార్నర్ (David Warner) చిరంజీవి ఫేస్‌ను మార్ఫ్ చేసి ఓ వీడియోను రిలీజ్ చేశాడు

ఆస్ట్రేలియన్ క్రికెట‌ర్ డేవిడ్ వార్నర్ (David Warner) ఆట పాట‌ల్లో ముందుంటాడు. క్రికెట్ ఎంత ఇష్ట‌ప‌డ‌తాడో వినోదాన్ని అంతే ప్రేమిస్తాడు. మ‌న తెలుగు స్టార్స్ అంటే కూడా డేవిడ్‌కు ఎంతో ఇష్టం. వాళ్లు న‌టించిన సినిమా పాట‌లు, డైలాగుల‌తో అద‌ర‌గొడ‌తాడు. సోష‌ల్ మీడియాలో డాన్సు వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను ఎంట‌ర్‌ట్రైన్ చేస్తుంటాడు. 

క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ (David Warner)కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌. సోష‌ల్ మీడియాలోనూ డేవిడ్ వార్న‌ర్ యాక్టీవ్‌గా ఉంటారు. మ‌న ఇండియ‌న్ సినిమాల‌న్నా, సాంప్ర‌దాయాల‌న్నా వార్న‌ర్‌కు ఎంతో ఇష్టం. అందులోనూ సౌత్ సినిమాలంటే వార్నర్‌కు న‌చ్చుతాయ‌ట‌. మ్యూజిక్‌, డాన్స్, డైలాగులతో అభిమానుల‌కు వినోదం పంచుతుంటాడు. 

అల్లు అర్జున్, మ‌హేష్ బాబు వీడియోలు చేసి సోషల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అయ్యాడు వార్న‌ర్(David Warner). ఇప్పుడు చిరంజీవి ఫేస్‌ను మార్ఫ్ చేసి ఓ వీడియోను రిలీజ్ చేశాడు. రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన బ్రూస్ లీ సినిమా లో చిరంజీవి క్లైమాక్ సీన్స్‌లో క‌నిపిస్తారు. ఆ వీడియోను వార్న‌ర్ మార్ఫింగ్ చేసి.. చిరంజీవి ఫేస్ బ‌దులు త‌న ఫేస్ పెట్టి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ స‌ర‌దాగా ఉందంటూ న‌వ్వుకుంటున్నారు.  
 

వార్న‌ర్ అంత‌కు ముందు పుష్ప సినిమాలో డైలాగుల‌ను పోస్ట్ చేశారు. కాక‌పోతే అల్లు అర్జున్ ఫేస్ మార్ఫ్ చేసి త‌న ఫేస్‌ను పెట్టి వీడియో చేశారు. మెగా అభిమానులు డెవిడ్ వార్నర్ పోస్టుల‌కు ఫిదా అవుతున్నారు. క్రికెట్, యాక్టింగ్ రెండు క‌లిసి భ‌లే ఎంట‌ర్‌ట్రైన్ చేస్తున్నాడంటూ వార్న‌ర్‌ను మెచ్చుకుంటున్నారు. 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!