థ్యాంక్యూ టీజర్‌‌లో నాగచైతన్య డైలాగ్స్‌పై దగ్గుబాటి రానా (Daggubati Rana) ట్వీట్.. వైరల్

Updated on May 27, 2022 07:28 PM IST
నాగచైతన్య, రానా
నాగచైతన్య, రానా

అక్కినేని నాగచైతన్య రీసెంట్‌గా నటించిన సినిమా 'థ్యాంక్యూ'. జూలై 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో చైతన్య మూడు నాలుగు గెటప్స్‌లో కనిపించాడు. రొమాంటిక్‌, యాక్షన్‌, స్పోర్ట్స్‌ సీన్స్‌ కలగలిసిన ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ట్విట్టర్‌లో ఈ సినిమా టీజర్‌‌ను షేర్‌ చేసిన నాగచైతన్య ‘నన్ను నేను సరిచేసుకోవడానికి చేస్తున్న ప్రయాణమే థ్యాంక్యూ’ అని క్యాపన్‌ ఇచ్చాడు. దీనిపై రానా (Daggubati Rana) కామెంట్లు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

చైతన్య చేసిన ట్వీట్‌పై రానా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘నువ్వు ఇప్పటికే సరి అయిపోయావు బ్రదర్, సూపర్ టీజర్ గయ్స్‌’ అంటూ కామెంట్‌ చేశాడు. కాగా, విక్రమ్‌ కె కుమార్‌ తెరకెక్కించిన థ్యాంక్యూ సినిమాను దిల్ రాజు, శిరీష్‌ కలిసి నిర్మిస్తున్నారు. హీరోయిన్లుగా రాశీ ఖన్నా, మాళవిక నాయర్‌ నటిస్తుండగా.. అవికా గోర్‌ ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది.

నాగచైతన్య చేసిన ట్వీట్‌పై రానా కామెంట్

దగ్గుబాటి రానా నటించిన ‘విరాట పర్వం’ జూలై 1న థియేటర్‌‌లో విడుదల కానుంది. విప్లవాత్మక ప్రేమకథగా వస్తున్న ‘విరాటపర్వంలో రానా కామ్రేడ్‌ రవన్నగా నటిస్తున్నాడు. ప్రియమణి ముఖ్య పాత్రలో కనిపించనుంది. ద‌గ్గుబాటి సురేష్‌ బాబు సమర్పణలో సుధాక‌ర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేశ్ బొబ్బిలి సంగీతం అందించాడు.

బుధవారం రిలీజ్ అయిన థ్యాంక్యూ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంది. నాగచైతన్య డైలాగ్‌ డెలివరీకి థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. బిజినెస్‌ మ్యాన్‌గా, ప్లేయర్‌‌గా, క్లాసీ, రఫ్‌, లవర్‌‌బాయ్ లుక్‌లో చైతన్య కనిపిస్తున్నాడు. ఏ మాయ చేశావె సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా నాగచైతన్య నుంచి ఆ రేంజ్ ఎక్స్‌ప్రెషన్స్‌ మనం ఎక్స్‌పెక్ట్‌ చెయ్యచ్చు అనే రేంజ్‌లో టీజర్‌‌ ఉంది.

ఇటీవల లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాల విజయాలతో జోరు మీదున్న నాగచైతన్య.. ప్రస్తుతం విక్రమ్‌ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న థ్యాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. రష్యాలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌తోపాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ సినిమాలో సూపర్‌‌స్టార్ మహేష్‌బాబుకు డై హార్డ్‌ ఫ్యాన్‌గా, హాకీ ప్లేయర్‌‌గా కనిపించనున్నాడు చైతన్య. చైతన్యపై రానా (Daggubati Rana) చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!