మహేష్‌బాబు (Mahesh Babu) వాయిస్‌ విని థ్రిల్‌ అయ్యానన్న చిరంజీవి (Chiranjeevi)

Updated on Apr 22, 2022 07:14 PM IST
మహేష్‌బాబును అభినందిస్తూ చిరంజీవి ట్వీట్
మహేష్‌బాబును అభినందిస్తూ చిరంజీవి ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్‌డేట్‌ వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే వార్తలు కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తాయి. అందులో చాలావరకు నిజమైతే బాగుంటుందని చాలామంది కోరుకుంటారు కూడా. మెగాస్టార్‌‌ చిరంజీవి సినిమా అప్‌డేట్‌పై కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తపై చిరు క్లారిటీ ఇచ్చారు.

చిరంజీవి, మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్‌ హీరోలుగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాకు సూపర్‌‌స్టార్, ప్రిన్స్ మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌‌ ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్‌‌ వేదికగా కన్ఫమ్ చేశారు. అంతేకాదు మహేష్‌బాబు వాయిస్‌ విని థ్రిల్‌ అయ్యానని కూడా చెప్పారు. ‘‘డియర్ మహేష్‌.. ఆచార్య సినిమాలో ‘పాదఘట్టం’ సన్నివేశాన్ని నీ వాయిస్‌తో పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాలో ప్రత్యేకంగా నువ్వు కూడా భాగమైనందుకు సంతోషంగా ఉంది. నీ వాయిస్‌ విని నేను, చరణ్‌ థ్రిల్‌ అయ్యాం. అదే విధంగా ప్రేక్షకులు, అభిమానులు కూడా కచ్చితంగా ఆనందిస్తారు” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమాలో ‘ధర్మస్థలి’ పేరుతో భారీ సెట్‌ వేశారు. పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు. మ్యాట్నీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ మ్యూజిక్‌ అందించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!