సమస్యల నుంచి ఇండస్ట్రీని బతికించింది చిరంజీవే (Chiranjeevi)

Updated on Apr 25, 2022 07:55 PM IST
సమస్యల నుంచి ఇండస్ట్రీని బతికించింది చిరంజీవే (Chiranjeevi)
సమస్యల నుంచి ఇండస్ట్రీని బతికించింది చిరంజీవే (Chiranjeevi)

ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా తెలుగు చలనచిత్ర పరిశ్రమను బతికించింది మాత్రం చిరంజీవి (Chiranjeevi) మాత్రమేనని నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ అన్నారు. సోషల్‌ మీడియాలో చిరంజీవిపై కామెంట్లు చేయడం కాదు. నా ముందు విమర్శలు చేయాలని ప్రసాద్‌ సవాల్‌ చేశారు. ‘కరోనా వ్యాప్తి, 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవడం, టికెట్‌ ధరల పెరుగుదల వంటి అనేక సమస్యలతో పరిశ్రమ అనేక సవాళ్లను ఎదుర్కొంది. సమస్యలతో ఇండస్ట్రీ నలిగిపోతున్న సమయంలో వాటి పరిష్కారానికి కొందరు ప్రయత్నిస్తుంటే మరికొందరు మాత్రం కామెంట్లు చేశారు. సోషల్‌ మీడియాతో సహా పలు మీడియాల్లో ఎవరెవరో చాలా మాట్లాడారు. ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా ఈరోజు ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించిన ఒకే ఒక్క వ్యక్తి చిరంజీవి మాత్రమే. కరోనా తర్వాత పరిశ్రమ బతికిందంటే దానికి చిరంజీవే కారణమని సవాల్‌ చేసి చెబుతున్నా. దీనిపై సోషల్‌ మీడియాలో కామెంట్లు చేయడం కాదు. నాతో మాట్లాడమని చెప్పండి. గాడ్‌ఫాదర్‌‌ సినిమా వేడుకలో వీటన్నింటి గురించి వివరంగా మాట్లాడుతా. కరోనా మహమ్మారి కారణంగా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌, కేజీఎఫ్, సర్కారు వారి పాట సినిమాలు చాలా కష్టాలు ఎదుర్కొన్నాయి. వీటి నుంచి బయటపడి ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌, కేజీఎఫ్ సినిమాలు రిలీజై సక్సెస్‌ అయ్యాయి. దేశంలోనే గర్వించదగిన సినిమాలుగా నిలిచాయి. ఇక, ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలు విడుదలై విజయం సాధిస్తే టాలీవుడ్‌ నంబర్‌‌వన్‌ స్థానానికి చేరుకుంటాయి’ అని ఎన్వీ ప్రసాద్‌ చెప్పారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!