ఆచార్య(Acharya)తన భార్య కలన్న చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఆచార్య(Acharya) ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో అభిమానులు పండుగ చేసుకున్నారు. ఆచార్య(Acharya) సినిమా విశేషాలతో ఈవెంట్ దద్దరిలింది. చిరంజీవి, రామ్ చరణ్‌లతో పాటు ఆచార్య(Acharya) టీం అభిమానులను ఎంటర్‌టైన్ చేశారు.
చిరు మనసులో మాటలు..
రామ్ చరణ్(Ram Charan)తో కలిసి నటించేందుకు కష్టాపడాల్సి వచ్చిందని చిరంజీవి అన్నారు. రాజమౌళిని ఒప్పించేందుకు తన భార్య సురేఖతో అడిగించామన్నారు చిరు. చిరంజీవి, రామ్ చరణ్(Ram Charan)లు కలిసి నటించాలనేది సురేఖ కల. ఆ కలను నెరవేర్చేందుకు రాజమౌళి ఆచార్య(Acharya) సినిమా కథను సిద్ధం చేశారన్నారు.
రుద్రవీణ సినిమా చేసిన తర్వాత జాతీయ అవార్డుల ఫంక్షన్ కోసం అప్పట్లో ఢిల్లీ వెళ్లానని చిరంజీవి(Chiranjeevi) చెప్పారు. ఆ అవార్డుల కార్యక్రమంలో చాలా వరకు హిందీ సినిమా వాళ్ల ఫోటోలే ఉన్నాయని... దక్షిణాది వారి ఫోటో ఒక్కటే ఉందన్నారు. ఎంజీఆర్-జయలలిత ఫొటో ఒకటి, మలయాళ నటుడు ప్రేమ్ నజీర్ ఫొటో మాత్రమే కనిపించాయని చెప్పారు. ఆ సన్నివేశం తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు. తెలుగు సినిమాకు జాతీయస్థాయిలో ఆదరణ లేదనిపించింది.
ఇన్నాళ్ల తర్వాత తెలుగు సినిమా గొప్పదనం రొమ్ము విరుచుకుని మరీ చెప్పేలా రాజమౌళి చేశారని.. చిరు అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ తలెత్తుకునేలా చేశారని పొగిడారు. ఇకపై ప్రాంతీయ సినిమాలు ఉండవని.. రాజమౌళి బాటలోనే అన్ని సినిమాలు ఉంటాయన్నారు. ఇప్పుడు యశ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అందరూ పాన్ ఇండియా స్టార్లు అంటూ చిరంజీవి(Chiranjeevi) సంతోషపడ్డారు.
పూజ నవ్వుకు తన భార్య పెద్ద ఫ్యాన్ అంటూ చిరంజీవి(Chiranjeevi) చెప్పుకొచ్చారు. పూజ పక్కన హీరోగా చేస్తే బాగుండేదని సరదాగా మాట్లాడారు. ప్రేక్షకులకు వినోదం పంచే అనేక సినిమాలు ఆచార్య సినమాలో ఉన్నాయన్నారు.
రాజమౌళి ఏమన్నారు?
చిరంజీవి(Chiranjeevi) ఎన్ని విజయాలు సాదించినా ఒదిగి ఉంటారని స్టార్ డైరెక్టర్ రాజమౌళి మెచ్చుకున్నారు. రామ్ చరణ్ సినిమా మగదీర చేసేటప్పుడు చిరంజీవి కూడా గైడ్ చేస్తారనుకున్నాను. కానీ చిరంజీవి తన కొడుకు సినిమా అయినా కూడా జోక్యం చేసుకోరు. ఎందుకంటే రామ్ చరణ్(Ram Charan)కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. రామ్ చరణ్ (Ram Charan)తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత కూడా అతనే తీసుకోవాలని చిరు ఆలోచన. చిరంజీవి(Chiranjeevi) కంటే రామ్ చరణ్ ఆచార్య సినిమాలో బాగుంటారని రాజమౌళి సరదాగా అన్నారు.
కొరటాల శివ ఫీలింగ్స్..
చిరంజీవి(Chiranjeevi) సినిమా షూటింగ్ చూస్తే చాలు అనుకునేంత అభిమానం తనదని.. కానీ మెగాస్టార్‌తో సినిమా చేయడం సంతోషంగా ఉందని కొరటాల శివ అన్నారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలకు పెద్ద ఫ్యాన్ అని చెప్పారు.
రామ్ చరణ్ స్పీచ్
ఆచార్య (Acharya) సినిమాను ఫుల్ ఎంజాయ్ చేశానని రామ్ చరణ్(Ram Charan) చెప్పారు. తన తండ్రితో సినిమా చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. చిరంజీవి(Chiranjeevi) నటనను దగ్గర నుంచి చూస్తూ... కొడుకుగా ఎన్నో నేర్చుకున్నానని రామ్ చరణ్ (Ram Charan)చెప్పారు. రాజమౌళితో సినిమా చేయాలంటే నటులు ఆయన చెప్పినట్టు చేయాల్సిందేనన్నారు. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్ హై రేంజ్ అంటూ పొగిడారు.
చిరంజీవి సినిమా అనో, తన అమ్మ అడిగిందనో కానీ రాజమౌళి తనను ఆచార్య సెట్స్ పైకి పంపారన్నారు. కొరటాల శివ డైరెక్షన్‌లో చేయడం సంతోషంగా ఉందన్నారు. వేదికపైకి ఓ అభిమాని దూసుకొచ్చాడు. ఆ అభిమానికి కూల్‌గా దగ్గరకి తీసుకుని సెల్ఫీ ఇచ్చి పంపారు రామ్ చరణ్(Ram Charan).
ఎవరెవరు వచ్చారు
చిరంజీవి భార్య సురేఖ, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన(Upasana) కూడా ఆచార్య(Acharya) ప్రీ రిలీజ్ ఈవెంటుకు వచ్చారు. వేల అభిమానులు మధ్య ఆచార్య ప్రీ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.