పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) సినిమా చేయను: బండ్ల గణేష్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నాకు దేవుడు. పవన్ అంటే నాకు పిచ్చి. పవన్‌కు నేను పెద్ద ఫ్యాన్. పవన్ నా ఆరాధ్య దైవం. ఈశ్వరా.. పవనేశ్వరా.. అంటూ పవన్ కల్యాణ్‌పై తనకు ఉన్న అభిమానాన్ని పదే పదే చెబుతుంటాడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్.
పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్ సినిమాను నిర్మించి పెద్ద హిట్ కొట్టాడు బండ్ల. మరోసారి పవన్‌తో సినిమా చేయబోతున్నానంటూ ప్రకటించాడు. అయితే తాజాగా బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ కల్యాణ్‌తో సినిమా చేయకూడదని అనుకుంటున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అసలు బండ్ల గణేష్ ఎందుకు ఈ కామెంట్లు చేశాడని అనుకుంటున్నారు అంతా.
పవన్ కల్యాణ్ అంటే ప్రాణం అని పదే పదే చెప్పే బండ్ల గణేష్.. పవన్‌తో సినిమా చేయకూడదని అనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయాలతోపాటు సినిమాల్లో కూడా బిజీ బిజీగా ఉన్నారు. నాలుగైదు సినిమాలు చేస్తూ ఖాళీ లేకుండా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. ఆ సినిమాలు పూర్తి చేసి తనకు సినిమా చేసే అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను. అయితే ఆయనతో సినిమా చేయకూడదని అనుకుంటున్నానని, పవన్ కల్యాణ్ త్వరగా ముఖ్యమంత్రి అయిపోవాలని కోరుకుంటున్నానని అన్నాడు.
దర్శకుడితో గొడవలు కావడం వల్ల సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదన్నారు బండ్ల గణేష్. సినిమా అంటే నాకిష్టం. సినిమానే నా ప్రాణం. కనుక సినిమాలు తీస్తూనే ఉంటాను అన్నాడు బండ్ల. పవన్ కల్యాణ్ ఎమ్మెల్సీ ఇస్తే తీసుకుంటారా? అలా అయితే మినిస్టర్ కూడా అయ్యే చాన్స్ ఉంటుంది కదా అని అడిగిన ప్రశ్నకు బండ్ల సమాధానం ఇచ్చాడు. తనకు ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, ఎంపీలు వద్దు. జనం దయతో వార్డు మెంబర్‌గా గెలిచినా ఆ కిక్కే వేరు అని అన్నాడు. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో తాను లేనని స్పష్టం చేశాడు.
భవిష్యత్తులో రాజకీయాల్లోకి గానీ వస్తే అప్పటి పరిస్ధితుల ప్రకారం నిర్ణయం తీసుకుంటానని అన్నాడు బండ్ల గణేష్. ఇక, బొత్స సత్యనారాయణ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అంటే తనకు ప్రేమ అని చెప్పాడు. తన ఫ్యామిలీని అభిమానించి, ప్రేమించినట్టుగానే వాళ్లను కూడా ప్రేమిస్తాను అని బండ్ల గణేష్ తెలిపాడు.