బ్ర‌హ్మాస్త్రంలో (Brahmastra) భ‌యంక‌ర‌మైన పాత్ర‌లో మౌనీ రాయ్.. పోస్ట‌ర్‌లో ఎలా ఉందంటే..!

Updated on Jun 14, 2022 08:29 PM IST
బ్ర‌హ్మాస్త్రం (Brahmastra) లో మౌని రాయ్ లుక్ విడుద‌ల చేశారు. భ‌యంక‌ర‌మైన క‌ళ్ల‌తో మౌనిరాయ్ విల‌న్ రోల్‌లో కనిపించారు.
బ్ర‌హ్మాస్త్రం (Brahmastra) లో మౌని రాయ్ లుక్ విడుద‌ల చేశారు. భ‌యంక‌ర‌మైన క‌ళ్ల‌తో మౌనిరాయ్ విల‌న్ రోల్‌లో కనిపించారు.

భారీ బ‌డ్జెట్ సినిమా బ్ర‌హ్మాస్త్రం (Brahmastra) నుంచి మరో క్రేజీ అప్ డేట్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. హిందీ సీరియ‌ల్స్‌లో విల‌న్ పాత్ర‌లో మెప్పించిన మౌని రాయ్ (Mouni Roy) బ్ర‌హ్మాస్త్రంలో ఓ నెగెటివ్ షేడ్ పాత్రలో న‌టిస్తున్నారు.

బ్ర‌హ్మాస్త్రంలో మౌని రాయ్ లుక్‌ను ఇటీవలే విడుద‌ల చేశారు. భ‌యంక‌ర‌మైన క‌ళ్ల‌తో మౌని రాయ్ ఒక డార్క్ షేడ్ లుక్‌లో కనిపించారు. వినాశ‌నం కోరుకునే ఆమె పాత్ర‌ ఉత్కంఠను క‌లిగించే విధంగా ఉంది. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

జులై 15 న బ్ర‌హ్మాస్త్రం ట్రైలర్

అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున.. ఇలా పెద్ద పెద్ద తారలందరూ బ‌హ్మాస్త్రం చిత్రంలో క‌నిపించ‌నున్నారు. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. వేక్ అప్ సిడ్, ఏ జవానీ హై దివానీ లాంటి హిందీ సినిమాలను డైరెక్ట్ చేసిన అయాన్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 'బ్రహ్మాస్త్రం' సినిమా ట్రైల‌ర్ జూలై 15 న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. 

మౌని రాయ్ చంపేసిందంటూ అయాన్ పోస్ట్
సీరియ‌ల్‌లో నాగిని పాత్ర‌లో న‌టించిన మౌని రాయ్‌కు విప‌రీత‌మైన ఫాలోయింగ్ పెరిగింది. బ్ర‌హ్మాస్త్రం (Brahmastra) సినిమాకు మౌని రాయ్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అని ద‌ర్శ‌కుడు అయాన్ అంటున్నారు.

జునూన్ పాత్ర‌లో చీక‌టి రాణిగా ఎంతో అద్భుతంగా న‌టించార‌న్నారు. మౌని రాయ్ న‌ట‌న‌తో చంపేస్తుందంటూ కామెంట్ పెట్టారు. ఇక ఈ కామెంట్‌తో మౌని రాయ్ చంప‌బోయేది ఎవ‌రనే ఉత్కంఠ ప్రేక్ష‌కుల్లో పెరిగింది. మౌనిరాయ్ బ్ర‌హ్మాస్త్రం సినిమాకు ఓ సర్‌ప్రైజ్ అంటూ ద‌ర్శ‌కుడు అయాన్ తెలిపారు. 

నాగార్జున రోల్ ఎలా ఉండ‌బోతుందంటే!
బ్ర‌హ్మాస్త్రంలో నాగార్జున  (Nagarjuna) ఓ ప‌వ‌ర్ ఫుల్ రోల్‌లో న‌టిస్తున్నారు.  ఈ సినిమా పోస్ట‌ర్‌లో నాగార్జున చాలా ఆవేశంగా క‌నిపించడం గమనార్హం. అంతేకాదు, నాగ్ త‌ల‌కు గాయాలు కూడా ఉన్నాయి. ఓ పోరాట యోధుడి గెటప్‌లో ఆయన కనిపిస్తున్నారు. నెటిజన్ల సమాచారం ప్రకారం,  పురావస్తు శాఖ నిపుణుడు అజయ్‌ విశిష్ఠ్‌ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. 

అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలక పాత్రధారులుగా బ్ర‌హ్మాస్త్రం తెర‌కెక్కుతోంది. మూడు పార్టులుగా ఈ బ్ర‌హ్మాస్త్రం సినిమా విడుద‌ల కానుంది. మొద‌టి భాగాన్ని బ్ర‌హ్మాస్త్రం - శివ పేరుతో విడుద‌ల చేస్తున్నారు. బ్ర‌హ్మాస్త్రం (Brahmastra) ట్రైల‌ర్ జూన్ 15న.. అలాగే సినిమాను సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ చేస్తున్నారు.

Read More:  Brahmastra : రణ్‌బీర్ కపూర్, నాగార్జున నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాకి.. చిరంజీవికి కనెక్షన్ ఏమిటి ?

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!