రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటిన సల్మాన్‌ ఖాన్(Salman Khan) .. ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అంటూ కామెంట్ !

Updated on Jun 23, 2022 01:48 PM IST
రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటుతున్న సల్మాన్ ఖాన్
రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటుతున్న సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan) ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నారు. తన సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్ వచ్చిన సల్లూ భాయ్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌‌తో కలిసి మొక్కలు నాటారు.

మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సల్మాన్ ఖాన్ కోరారు. 'మొక్క నాటామా.. పని అయిపోయిందా ' అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు దాని బాధ్యతను స్వీకరించాలని ఆయన చెప్పారు. 'ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడినంత ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందని ' గుర్తుచేశారు సల్మాన్.

రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటుతున్న సల్మాన్ ఖాన్

మొక్కలు పెంచడమే మార్గం..

అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో దేశంలో అనేక మంది ప్రజలు మన కళ్ల ముందే చనిపోతుండటం బాధాకరం.  వాతావరణ మార్పుల కారణంగా వస్తున్న విపత్తులను అరికట్టాలంటే చెట్లు పెంచడం ఒక్కటే మార్గమని సల్మాన్ ఖాన్ చెప్పారు.

ఈ మంచి పనికి ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో బాటలు వేశారని అన్నారు సల్మాన్ ఖాన్. మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకుంటే.. మన భూమితోపాటు భవిష్యత్తు తరాలను కాపాడుకోవచ్చని సల్మాన్ ఖాన్ తెలిపారు. తన అభిమానులంతా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా, మొక్కలు నాటే కార్యక్రమానికి  ఆహ్వానం పంపిన వెంటనే  స్పందించిన సల్మాన్ ఖాన్ (Salman Khan) కి ఈ  సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. 'మీరు మొక్కలు నాటడం కోట్ల మంది అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ' ఆయన సల్మాన్ ఖాన్‌‌ను పొగడ్తలతో ముంచెత్తారు. 

Read More :  Salman Khan: సల్మాన్ ఖాన్ స‌పోర్ట్‌తో హిందీ సినిమాల్లోకి.. రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) !

రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటుతున్న సల్మాన్ ఖాన్

రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటుతున్న సల్మాన్ ఖాన్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!