అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) ‘రామ్‌సేతు’ తెలుగు టీజర్‌ రిలీజ్‌.. యాక్షన్ సీన్లతో అదరగొట్టిన సూపర్‌‌స్టార్

Updated on Sep 30, 2022 03:10 PM IST
రామ్‌సేతు సినిమాలో అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) పురావస్తు శాఖ పరిశోధకుడిగా నటించారు.
రామ్‌సేతు సినిమాలో అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) పురావస్తు శాఖ పరిశోధకుడిగా నటించారు.

బాలీవుడ్‌ సూపర్‌‌స్టార్‌ అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) ప్రస్తుతం భారీ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ‘సూర్యవంశీ’ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆయనకు సరైన హిట్‌ దక్కలేదనే చెప్పాలి. సూర్యవంశీ సినిమా తర్వాత దాదాపు ఆరు సినిమాలు చేసినా.. అక్షయ్‌ కుమార్‌కు ఆయన రేంజ్‌కు తగ్గ సక్సెస్ అందలేదు. ప్రస్తుతం ఆయన నటించిన సినిమా రామ్‌సేతు. అభిమానులతోపాటు అక్షయ్ ఆశలు కూడా ప్రస్తుతం ఆ సినిమాపైనే ఉన్నాయి.

శంకర్‌‌ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన 2.0 సినిమాలో విలన్‌గా నటించారు అక్షయ్‌కుమార్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారాయన. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన రామ్‌సేతు సినిమాలో తెలుగులో విభిన్నమైన సినిమాలతో దూసుకుపోతున్న సత్యదేవ్‌ కీలకపాత్రలో నటించారు. యాక్షన్ అడ్వంచర్ నేపథ్యంలో తెరకెక్కిన రామ్‌సేతు సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్‌‌ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే వరుస అప్‌డేట్స్‌ ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. రామ్‌సేతు తెలుగు టీజర్‌‌ను శుక్రవారం ఉదయం విడుదల చేశారు. 

రామ్‌సేతు సినిమాలో అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) పురావస్తు శాఖ పరిశోధకుడిగా నటించారు.

భారీగా పెరిగిన అంచనాలు..

‘రామ్‌సేతు కాపాడుకోవడానికి మన దగ్గర ఇంకా మూడురోజులే గడువు ఉంది’ అనే డైలాగ్‌తో టీజర్‌‌ మొదలైంది. టీజర్‌‌లో యాక్షన్, ఛేజింగ్, ఫైరింగ్ సీన్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ‘రామ్‌సేతును చేరుకోబోతున్నాం’ అనే డైలాగ్‌తో టీజర్ ముగిసింది. అక్షయ్‌ కుమార్‌‌ హీరోగా నటిస్తున్న సినిమా అంటే అభిమానులకు మంచి అంచనాలే ఉంటాయి. కాగా, టీజర్ రిలీజ్ అయిన తరువాత రామ్‌సేతు సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

రామ్‌సేతు సినిమాలో పురావస్తు శాఖ పరిశోధకుడిగా కనిపించారు అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar). జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌, నుష్రత్‌ భారుచ్చా హీరోయిన్లుగా నటించారు.  అమెజాన్, లైకా సంస్థలతో కలిసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా రామ్‌సేతు సినిమాను నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Read More : అక్ష‌య్ కుమార్(Akshay Kumar) చేసిన యాడ్ య‌శ్ చేయ‌ర‌ట‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!