Akshay Kumar: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా 'రక్షాబంధన్‌' (RakshaBandhan).. హైదరాబాద్ లో ప్రమోషన్స్..!

Published on Aug 07, 2022 10:53 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) సంవత్సరానికి నాలుగు సినిమాలు తీస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'రక్షాబంధన్‌'. దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌, అక్షయ్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రక్షాబంధన్‌ పండుగ సందర్భంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం, తమ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలు నగరాలలో సందడి చేస్తున్నారు.   

ఈ క్రమంలో 'రక్షాబంధన్‌' (RakshaBandhan) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్‌ కుమార్‌ 'సూపర్ సింగర్ 2' కార్యక్రమంలో పాల్గొన్నాడు. రాఖీ స్పెషల్‌ ఎపిసోడ్ కావడంతో రక్షా బంధన్ సినిమాని ప్రమోట్‌ చేసేందుకు వెళ్లాడు. ఆ కార్యక్రమంలో అక్షయ్‌ కుమార్‌ సోదరి అల్కా భాటియా రాఖీ కట్టే ఫొటోలను వీడియోగా చేసి చూపించారు. ఆ వీడియో చూస్తూ అక్షయ్‌ కుమార్‌ భావోద్వేగానికి గురయ్యాడు. అందరి ముందే ఏడ్చేశాడు.

ఇదిలా ఉంటే.. 'రక్షాబంధన్‌' (RakshaBandhan) చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా బృందం హైదరాబాద్‌ నగరాన్ని సందర్శించింది. ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే ఈ చిత్ర బృందం దుబాయ్‌, పూణే, ఇండోర్‌లో సందడి చేసింది. ఈ బృందంలో అక్షయ్‌కుమార్‌, నిర్మాత ఆనంద్‌ ఎల్‌ రాయ్, నటీనటులు సాడియా ఖతీబ్‌, స్మృతి శ్రీకాంత్‌, సహేజ్మీన్‌ కౌర్‌, దీపికా ఖన్నాలు హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేసిన ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

పీవీఆర్‌ (సినీ మ్యాక్స్‌)లో మీడియా సమావేశంలో పాల్గొన్న వీరు అనంతరం చార్మినార్‌ (Charminar) వద్ద సందడి చేశారు. తమ అభిమాన సూపర్‌స్టార్‌ తో పాటుగా చిత్ర బృందాన్ని దగ్గరగా చూసేందుకు, వారితో ముచ్చటించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కాగా,జీ స్టూడియోస్‌తో కలిసి ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ (Aanand L Rai), హిమాంశు శర్మ, అల్కా హిరానందానీ, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ నిర్మాణంలో రక్షాబంధన్ చిత్రం తెరకెక్కింది. హిమాంశు శర్మ, కనికా ధిల్లాన్ మాటలను అందించగా.. హిమేష్‌ రేష్మియా సంగీత దర్శకత్వం అందించారు. ఈ చిత్రంలోని పాటలకు సాహిత్యాన్ని ఇర్షాద్‌ కమిల్‌ అందించారు.

Read More: నాగచైతన్యతో విడాకులపై ‘కాఫీ విత్ కరణ్‌’ షోలో సమంత (Samantha) కామెంట్లు.. అక్షయ్‌ కుమార్‌‌తో కలిసి సందడి