బాలీవుడ్‌ స్టార్‌‌ అక్షయ్‌ కుమార్‌‌(Akshay Kumar)కు కరోనా.. కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌కు దూరంగా స్టార్‌‌ హీరో

Updated on May 15, 2022 09:04 PM IST
‌అక్షయ్‌ కుమార్ (Akshay Kumar)
‌అక్షయ్‌ కుమార్ (Akshay Kumar)

కరోనా.. ఈ పేరు చెబితే ఒకప్పుడు అందరికీ చెమటలు పట్టేవి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు, పేదల నుంచి సంపన్నుల వరకు అందరినీ భయపెట్టిందీ మహమ్మారి. రెండు సంవత్సరాలు అందరినీ ఒక ఆట ఆడేసుకుందీ వైరస్. కరోనా కారణంగా రెండు సంవత్సరాలు ఏ కార్యక్రమం జరగలేదు. అన్నీ వాయిదాలు పడుతూనే వచ్చాయి. కొన్నాళ్లు ఈవెంట్లు జరిగినా వాటిని ప్రేక్షకులు లేకుండానో, తక్కువ శాతం మందితోనే నిర్వహించారు నిర్వాహకులు.

సినిమా రంగంలో ప్రతిష్మాత్మకంగా చెప్పుకునే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్‌లో త్వరలో మొదలుకానుంది. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందడం ఒక ఎఛీవ్‌మెంట్‌. కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రావాలని బాలీవుడ్‌, టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులకు ఇన్విటేషన్స్ అందుతాయి. అదే వారికి దక్కిన గౌరవంగా కూడా భావిస్తుంటారు కొందరు. ఆ ఈవెంట్‌కు హాజరుకావడం కూడా గౌరవమే.

ఇదిలా ఉంటే బాలీవుడ్‌ స్టార్ అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)‌కు కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌కు  రావాలని ఆహ్వానం అందింది. అయితే ఈ సంవత్సరం ఆయన ఈ ఫెస్టివల్‌కు హాజరుకావడం లేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌‌ ద్వారా అక్షయ్‌ తెలిపారు. కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనడానికి వెళ్లేందుకు కరోనా టెస్ట్‌ చేయించుకోగా.. పాజిటివ్‌ రిపోర్ట్ వచ్చింది. దీంతో అక్షయ్‌ తన ఫ్రాన్స్‌ ప్రయాణాన్ని కేన్సిల్ చేసుకున్నారు.

ప్రస్తుతానికి తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, రెస్ట్‌ తీసుకుంటున్నట్టు అక్షయ్(Akshay Kumar) చెప్పారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని ట్వీట్ చేశాడు. కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌కు వెళుతున్న ఇండియన్‌ యాక్టర్స్‌కు అక్షయ్‌ అభినందనలు తెలిపారు. ఇండియా తరఫున కేన్స్‌కు ఏఆర్‌‌ రెహమాన్, మామ్‌ ఖాన్, నావాజుద్దీన్‌ సిద్దిఖీ, ప్రసూన్‌ జోషి, మాధవన్, రిక్కీ కేజ్, శేఖర్‌‌ కపూర్, నయనతార, పూజా హెగ్డే, తమన్నా, లావణ్య త్రిపాఠి వెళ్లనున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!