నాగార్జున (Nagarjuna) , రణ్ బీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో 'బ్రహ్మాస్త్ర'(Brahmastra).. ప్రమోషన్లలో అరుదైన దృశ్యం

Updated on Aug 26, 2022 04:22 PM IST
‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది.
‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది.

టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). ఇందులో రణ్‌ బీర్‌ కపూర్‌ హీరోగా నటించగా, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాను తెలుగులో సమర్పిస్తూ,  ప్రమోట్‌ చేస్తున్నారు.

రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కపూర్ సరసన అలియాభట్ (Alia Bhatt) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. షారూఖ్‌ ఖాన్‌ గెస్ట్ రోల్‌ చేయగా.. బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను జోరుగా నిర్వహిస్తోంది చిత్ర యూనిట్.

‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. నాగార్జున, రాజమౌళి, రణ్‌బీర్‌ పాల్గొన్న ఈ ప్రమోషన్లలో వీరు ముగ్గురు చేసిన విందు భోజనం ఇప్పుడు అందరి హృదయాలకు గెలుచుకుంటోంది. అరిటాకు భోజనం చేయడం ఆశ్చర్య పరుస్తోంది. వీరు చెన్నై లో జరిగిన ప్రమోషన్లలో భాగంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలను సమాధానాలిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, ఈ వీడియోపై స్పందిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘వావ్.. వాళ్లు అరిటాకులో తింటున్నారా’ అని కొందరూ.. ‘ఈ స్టార్లని ఇలా చూడడం చాలా బావుంది’ అని మరికొందరూ రాసుకొచ్చారు. అయితే.. ఈ వీడియోలో నాగార్జున, రాజమౌళి (SS Rajamouli) సహజంగా అలవాటైనట్లు తింటుండగా.. రణ్‌బీర్ (Ranbir Kapoor) కొంచెం ఇబ్బందిపడుతున్నట్లు కనిపించింది. దాంతో అది కేవలం ప్రమోషన్స్ కోసమే అలా చేస్తున్నాడని కొందరు విమర్శలు సైతం చేస్తున్నారు.

Read More: Luv Ranjan: రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటిస్తున్న 'లవ్ రంజన్' షూటింగ్ సెట్ లో అగ్ని ప్రమాదం..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!