త్రివిక్రమ్‌ సినిమాలో మహేష్‌ (MaheshBabu)కు తండ్రిగా బాలీవుడ్‌ హీరో?

Updated on Apr 25, 2022 07:36 PM IST
మహేష్‌ (MaheshBabu)కు తండ్రిగా బాలీవుడ్‌ హీరో
మహేష్‌ (MaheshBabu)కు తండ్రిగా బాలీవుడ్‌ హీరో

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తారు. ఇక త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే ఫ్యాన్స్​కు పండగే. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటన వచ్చినప్పటి నుంచి దాని గురించిన అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఒకటి నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

త్రివిక్రమ్, మహేష్‌ కాంబోలో రాబోతున్న మూడో సినిమాలో మహేష్‌ తండ్రి క్యారెక్టర్‌‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. దాంతో ఆ క్యారెక్టర్‌‌ను ఎవరు పోషించబోతున్నారనే దానిపై టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో కీలకపాత్రలో బాలీవుడ్‌లో సీనియర్ హీరో అనిల్‌ కపూర్ నటించబోతున్నాడని తెలుస్తోంది. మహేష్‌కు తండ్రి పాత్ర కావడం, కథలో కొంత ప్రాధాన్యత ఉండడంతో అనిల్‌ కపూర్‌‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇక, ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఏడాది జూన్‌ నుంచి షూటింగ్‌ ప్రారంభమవుతుంది.

మహేష్‌, త్రివిక్రమ్‌ కలయికలో పదకొండు సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా, ప్రస్తుతం మహేష్‌బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. తర్వాత రాజమౌళితో సినిమా చేయబోతున్న మహేష్.. ఆ చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ సినిమాను పట్టాలెక్కించే చాన్స్ ఉంది.

 ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ పూర్తికావడం, మే 12న రిలీజ్‌కు రెడీ కావడంతో మహేష్ కుటుంబంతో కలిసి దుబాయ్‌కి వెళ్లారు. హైదరాబాద్‌ ఎయిర్‌‌పోర్ట్​కు వెళ్లిన మహేష్‌బాబు ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  మే3వ తేదీన దుబాయ్‌ నుంచి తిరిగి రానున్నట్టు తెలుస్తోంది. ఇక, మహేష్‌బాబు తర్వాతి సినిమా రాజమౌళితో చేయబోతున్నారు. ‘సర్కారు వారి పాట’ సినిమా రిలీజ్ అయిన తరువాత తన తదుపరి చిత్ర షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!