పవన్‌ (Pawan Kalyan) సినిమాలో బాలీవుడ్ బ్యూటీ?

Updated on Apr 25, 2022 08:26 PM IST
పవన్‌ (Pawan Kalyan)  సినిమాలో బాలీవుడ్ బ్యూటీ?
పవన్‌ (Pawan Kalyan) సినిమాలో బాలీవుడ్ బ్యూటీ?

కేజీఎఫ్‌ సినిమాలో యాక్ట్‌ చేసిన వాళ్లను మంచి ఆఫర్లు వెతుక్కుంటూ వెళుతున్నాయి. ఈ క్రమంలోనే కేజీఎఫ్‌2లో ప్రధాన మంత్రి రమికా సేన్‌గా యాక్ట్‌ చేసిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్‌ పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో మారుమోగుతోంది. ఇప్పటికే తెలుగులో బంగారు బుల్లోడు, రథసారధి, ఆకాశవీధిలో సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న రవీనా.. చాలాకాలం తర్వాత కేజీఎఫ్‌2తో మరింత దగ్గరయ్యారు. కేజీఎఫ్‌2లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

దీంతో టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. అంతేకాదు ఆ ఆఫర్‌‌ కూడా టాలీవుడ్‌ అగ్ర హీరో సినిమాలో నటించడానికి వచ్చిందని సమాచారం.

పవర్‌‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కనున్న భవదీయుడు భగత్‌సింగ్‌ సినిమాలో రవీనా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గబ్బర్‌‌సింగ్‌ వంటి బంపర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్‌ నటించబోయే సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీమూవీ మేకర్స్‌ నిర్మించనున్న భవదీయుడు భగత్‌సింగ్‌ సినిమాలో రవీనా టాండన్‌ కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేయబోతున్నదనే వార్తలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి.

ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్న పవన్‌ త్వరలోనే ఈ సినిమాను కూడా పట్టాలెక్కించబోతున్నాడని తెలుస్తోంది. హరీష్‌ శంకర్‌‌ కూడా పవన్‌కు మరోసారి ఆ రేంజ్‌ హిట్‌ ఇవ్వాలనే కసితో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్.

కథలో కీలకమైన పాత్ర కోసం రవీనాను హరీష్ సంప్రదించారని, కథ, అందులో ఆమె పాత్ర నచ్చడంతో రవీనా కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఆ విషయాన్ని మైత్రీమూవీ మేకర్స్‌ అధికారికంగా ప్రకటిస్తుందేమో వేచి చూడాల్సిందే.

ఇక, భీమ్లానాయక్ వంటి భారీ హిట్‌ తర్వాత పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాలోని క్యారెక్టర్‌‌ కోసం పవన్‌ కొన్ని కసరత్తులు చేస్తున్నాడని తెలిసింది. అంతేకాకుండా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం.  ఏది ఏమైనా హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్‌ సింగ్ సినిమాలను పవన్‌ స్పీడ్‌గా కంప్లీట్ చేసి త్వరగా విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!