All Time Best Telugu Horror Movies: దెయ్యం సినిమాలా.. మాకేంటి భయం!
ఈవిల్ డెడ్ లాంటి హర్రర్ సినిమాలు చూడాలంటే హడలెత్తేవారు. భయంతో వణికి చచ్చేవారు. కానీ ఇప్పుడొచ్చే హర్రర్ సినిమాల కథే వేరు. థ్రిల్‌తో పాటు కామెడీ ఉంటుంది. సో ఇప్పుడైతే చిన్నా, పెద్దా హర్రర్ సినిమాలు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.
1. యూటర్న్
ఓ థ్రిల్లర్ సినిమా యూటర్న్. తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో సమంతా నటించారు. ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసే వారు ఎలా చనిపోతారనేది సస్పెన్స్ కొనసాగుతుంది. మిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి జర్నలిస్టు, పోలీసులే కాకుండా ప్రేక్షకులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించే సినిమా.
2. వదలడు
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జగన్‌గా సిద్దార్థ్ నటించారు. వదలడు అనే టైటిల్‌లోనే సస్పెన్స్ ఉంది. చనిపోయిన కూడా వదలకుండా ఎవరిని వెంటాడుతుంటాడనే కథతో సినిమా తీశారు.
3. జెస్సీ
ఓ వినూత్న హర్రర్ కథ జెస్సీ. విక్టోరియా హౌస్‌ని దెయ్యాలున్నాయని ఎవరూ కొనరు. దెయ్యాలు ఉన్నాయా? లేవా? అని కనిపెట్టేందుకు వెళ్లిన వారికి ఎదురయ్యే వింత పరిస్థులపై సినిమా సాగుతుంది. జెస్సీని ఆవహించిన ఆత్మ ఎవరిదనే ఉత్కంఠ కొనసాగుతుంది.
4. ఐరా
హీరోయిన్ నయనతార నటించిన దెయ్యం సినిమా ఐరా. బంగ్లాలో దెయ్యాలుంటాయని సరదాగా తీసిన వీడియోల్లో నిజంగా దెయ్యాలు కనిపిస్తే ఎలా ఉంటుంది. ఆ తర్వా త ఏం జరుగుతుందనే సస్పెన్స్‌తో సాగే సినిమా. నయనాతార నటన చూస్తే ఎవరైనా హడలెత్తాల్సిందే.
5. పెట్రోమాక్స్
థ్రిల్లర్, సస్పెన్స్ సినిమా పెట్రో మాక్స్. పెట్రో మాక్స్ అంటే లాంతరు. ఓ కుర్చీలో తమన్నా తలకిందులుగా కూర్చునే లుక్ ప్రేక్షకులను హడలెత్తిచింది.
6. నిను వీడని నీడను నేనే.
ఆసక్తికర సన్నివేశాలతో సాగే సినిమా. యాక్సిడెంట్ తర్వాత ఓ జంటకు కొత్త ముఖాలు వస్తాయి. ఎందుకు అలా జరిగింది. దాని కారణాల అన్వేణనతో సాగే కథ.
7. చీకటి గదిలో చితక్కొటుడు
థ్రిల్లర్, కామెడీతో పాటు రొమాంటిక్ సీన్స్ ఎక్కువ చీకటి గదిలో చితక్కొటుడు సినిమాలో.
8. ఓ స్త్రీ రేపు రా
ఓ స్త్రీ రేపు రా అంటూ ఎన్నో ఊర్లను వణికించిన కాన్సెప్ట్‌తో తీసిన ఓ కల్పిత. దెయ్యంతోనే కథ చెప్పే సీన్స్‌తో సినిమా సాగిపోతుంది.
9. బుడుగు
బన్ని అనే చిన్నారి విచిత్ర ప్రవర్తన ... అతనికి ఉన్న సమస్య ఏంటనేది బుడుగు సినిమా కథ. మాస్టర్ ప్రేమ్ బాబు బన్ని పాత్రలో కనిపిస్తాడు. అతని తల్లిగా మంచు లక్ష్మీ నటించారు.
10. భాగమతి
రాణీ భాగమతి దేవి దెయ్యమై తిరుగుతుందని అందరూ నమ్ముతుంటారు. అనుకోని పరిస్థుతుల్లో చంచల అనే అమ్మాయి ఆ బంగళాలో బంధీగా ఉంటుంది. చంచల భయపడుతుందా లేక భయపెడుతుందా అనే స్టోరీతో సాగిపోయే కథ. ఇది భాగమతి అడ్డా అంటూ అనుష్క అదిరగొట్టేసింది.