రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ (BalaKrishna)

Updated on May 03, 2022 10:06 PM IST
ముస్లింలకు బాలకృష్ణ (BalaKrishna) రంజాన్‌ శుభాకాంక్షలు
ముస్లింలకు బాలకృష్ణ (BalaKrishna) రంజాన్‌ శుభాకాంక్షలు

కరోనా లాక్‌డౌన్‌లోనూ అన్‌స్టాపబుల్‌ టాక్‌ షో ద్వారా అభిమానులను అలరించిన నందమూరి నటసింహం బాలకృష్ణ (BalaKrishna)..అఖండ సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్నాడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా లాక్‌డౌన్‌లో వెలవెలబోయిన థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది.

మంగళవారం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపాడు బాలకృష్ణ. సేవకు నిదర్శనంగానే రంజాన్‌ జరుపుకుంటారని అన్నారు. నేటి నుంచి ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. నెల రోజులపాటు కఠినంగా ఉపవాసం ఉన్న తర్వాత రంజాన్‌ను ముస్లిం సోదరులు చేసుకుంటారని తెలిపారు బాలయ్య.

ఇక, బాలయ్య నటించిన అఖండ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే సినిమా ఏంటనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా బాలకృష్ణ సినిమా టైటిల్‌ ‘అన్నగారు’ అని ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తోంది. బాలయ్య కూడా పూర్తి మాస్ సినిమా చేయాలని, దాంతో అటువంటి కథలపై ఆయన ఫోకస్‌ చేసినట్టు సమాచారం. బాలకృష్ణతో మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్న కథతో సినిమా చేయనున్నట్టు  గోపీచంద్‌ ప్రకటించారు. అప్పటినుంచి బాలయ్యను మలినేని గోపీచంద్‌ ఏ విధంగా చూపించబోతున్నారనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

బాల‌కృష్ణ (Bala Krishna) క్యారెక్ట‌ర్ ఆధారంగా 'అన్నగారు' టైటిట్ పెట్టార‌ని, కొత్త స్టోరీలో విభిన్న‌మైన పాత్ర‌లో బాల‌కృష్ణ క‌నిపించనున్నట్టు తెలుస్తోంది. డ‌బుల్ రోల్‌లో బాలకృష్ణ యాక్ట్ చేయనున్నార‌ని టాక్. అందులో ఒక‌టి ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ ఉన్న క్యారెక్టర్‌‌ కాగా, మరొకటి బిజినెస్‌మ్యాన్‌ క్యారెక్టర్ అని టాక్‌. చాలాకాలం తర్వా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో బాలకృష్ణ  నటించనున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలో విడుదలకు ప్లాన్‌ చేస్తోంది చిత్ర యూనిట్.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!