బాలకృష్ణ సినిమా(Bala Krishna)కు కొత్త సినిమా టైటిలా! (NBK 107)

Updated on May 01, 2022 06:20 PM IST
NBK 107: బాల‌కృష్ణ(Bala Krishna) కొత్త సినిమాకు టైటిల్ ఖ‌రారైన్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అఖండ సినిమా త‌ర్వాత ఎన్‌బీకే 107 ఏంట‌నే ప్ర‌శ్న అంద‌రిలోనూ ఉంది. ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా సినిమా టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తుంది. 

బాల‌కృష్ణ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో చేసిన అఖండ విజ‌యం సాధించింది. అఖండ త‌ర్వాత బాల‌కృష్ణ చేసే 107వ సినిమాపై అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. బాల‌కృష్ణ కూడా మాస్ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టార‌ని తెలుస్తుంది. గోపిచంద్ డైరెక్ష‌న్‌లో బాల‌కృష్ణ 107వ సినిమా చేయ‌నున్నారు. కమర్షియల్ మాస్ ఎలిమెంట్ క‌థ‌తో సినిమా చేయ‌నున్నారు గోపిచంద్. బాల‌కృష్ణ‌తో సిన‌మా చేయాల‌నేది గోపిచంద్ డ్రీమ్ అట‌. ఈ సినిమాతో గోపించంద్ క‌ల నెర‌వేర‌నుంది. 

గోపిచంద్ ర‌వితేజతో క్రాక్ సినిమా చేశారు. ఆ సినిమా చూసిన బాల‌కృష్ణ గోపిచంద్ డైరెక్ష‌న్‌కు ఓకే చెప్పేశారు. ఆరునెల‌లు క‌ష్ట‌ప‌డి స్టోరీ రెడీ చేశార‌ట గోపీచంద‌ర్. అనంత‌పురంలో జ‌రిగిన నిజ‌మైన సంఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమాను తీస్తున్నార‌ట‌. 
సినిమా టైటిల్‌పై చాలా హార్డ్ వ‌ర్క్ చేశార‌ట‌. ఎన్నో పేర్లు అనుకున్నా... చివ‌ర‌కు హైలెట్ అయ్యే 'అన్నగారు' టైటిట్ ఖ‌రారు చేశార‌ట‌. 

బాల‌కృష్ణ (Bala Krishna)క్యారెక్ట‌ర్ ఆధారంగా'అన్నగారు' టైటిట్ పెట్టార‌ట‌. కొత్త స్టోరీలో విభిన్న‌మైన పాత్ర‌లో బాల‌కృష్ణ క‌నిపిస్తార‌ట‌. డ‌బుల్ రోల్‌లో బాలకృష్ణ యాక్ట్ చేస్తార‌ని టాక్. ఒక‌టి ఫ్రాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ పాత్ర‌, రెండోది బిజినెస్ మాన్ పాత్ర‌గా తెర‌కెక్కిస్తున్నారు. నెగిటీవ్ షేడ్ ఉన్న పాత్ర బాల‌కృష్ణ చేయ‌డం కొత్త విష‌యం అని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. షూటింగ్ కూడా స‌గం పూర్తి చేశారు. విడుద‌ల కోసం ప్లాన్ చేస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!