Kajal Agarwal (కాజల్ అగర్వాల్) : మగబిడ్డకు జన్మనిచ్చిన మిత్రవింద
టాలీవుడ్ అందాల తార కాజల్ అగర్వాల్ మంగళవారం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతకుముందే తన అక్క డెలివరీ విషయం గురించిన ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి, ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు నిషా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పోస్ట్ చేశారు.
టాలీవుడ్ పరిశ్రమకు కాజల్ అగర్వాల్ పరిచయమే. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. మగధీర, మిస్టర్ పర్ఫెక్ట్, టెంపర్, బిజినెస్ మెన్, నేనే రాజు నేనే మంత్రి, సీత లాంటి సినిమాలు ఆమెకు బాగా పేరు తెచ్చాయి. తుపాకీ సినిమాలోని నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా సైమా అవార్డు కూడా గెలుచుకున్నారు.
2020 లో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్నారు కాజల్. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా సినీ నటే. ఏమైంది ఈ వేళ, సోలో, సుకుమారుడు లాంటి సినిమాలలో నిషా నటించారు. తాజాగా తన సోదరి మగబిడ్డకు జన్మనివ్వడం పై నిషా హర్షం వ్యక్తం చేశారు. తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.