18 ఏండ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో ఆర్య కాంబో.. సెట్‌లో అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్, రత్నవేలు

Updated on Aug 06, 2022 02:22 PM IST
ఆర్య సినిమాకు అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించగా, సుకుమార్ దర్శకుడిగా, రత్నవేలు డైరెక్టర్‌‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ అందించారు
ఆర్య సినిమాకు అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించగా, సుకుమార్ దర్శకుడిగా, రత్నవేలు డైరెక్టర్‌‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ అందించారు

 ‘పుష్ప’ సినిమాతో రికార్డులు క్రియేట్‌ చేశారు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), డైరెక్టర్‌ సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్‌లో పుష్పకు సీక్వెల్ రాబోతోంది. పుష్ప2 సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని బన్నీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

పుష్ప2 సినిమా షూటింగ్ ఆగస్టు మొదటి వారంలో మొదలవుతుందని అందరూ అనుకున్నారు. అయితే పలు కారణాలతో మొదలుకాలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బయటకు వచ్చిన ఫోటోలు చూసిన అభిమానులు పుష్ప2 సినిమా షూటింగ్‌ మొదలైందని అనుకుంటున్నారు. బన్నీ, సుకుమార్, రత్నవేలు కలిసున్న ఫోటో ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ఆర్య సినిమా పోస్టర్

అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు..

‘పుష్ప’ సినిమా సూపర్‌‌హిట్‌ సాధించిన తర్వాత ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యేందుకు బన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బన్నీ ఫేమ్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డాయి వాణిజ్య సంస్థలు. ఇటీవల త్రివిక్రమ్‌, హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో యాడ్స్‌ చేసిన బన్నీ.. ఇప్పుడు సుకుమార్‌ నేతృత్వంలో ఒక యాడ్‌ కోసం పని చేశారు.

సుకుమార్‌ యాక్షన్‌ చెప్పగా.. రత్నవేలు కెమెరాకు పని చెప్పారు. ఈ యాడ్‌లో బన్నీ స్టైలిష్‌ లుక్‌లో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను రత్నవేలు ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘సుమారు 18 సంవత్సరాల తర్వాత మేము ముగ్గురూ కలిసి ఒకషూట్‌లో పాల్గొన్నాం. బన్నీ, సుకుమార్‌ని కలుసుకోవడం సంతోషంగా ఉంది’ అని రత్నవేలు పేర్కొన్నారు. 2004వ సంవత్సరంలో విడుదలైన ‘ఆర్య’ సినిమా కోసం అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్, రత్నవేలు కలిసి పనిచేశారు.

Read More : ‘పుష్ప’ సిగ్నేచర్‌ వాక్‌ క్రెడిట్‌ ఎవరిదంటే..సీక్రెట్‌ చెప్పేసిన అల్లు అర్జున్‌ (Allu Arjun)


టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!