అమెరికాలో బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations).. సందడి చేసిన యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj)
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఉత్సవం బతుకమ్మ పండుగ వేడుకల (Bathukamma Celebrations)ను అమెరికాలో ఘనంగా నిర్వహించారు. ‘తానా’ ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ఆదివారం బతుకమ్మ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు ఆంధ్ర, తెలంగాణ అనే తేడాల్లేకుండా న్యూజెర్సీ, కానికట్, అట్లాంటా తదితర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగువారంతా తరలిరావడం విశేషం.
‘తానా’ నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో న్యూజెర్సీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ముఖ్య అతిథిగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఉత్సవంలో భాగంగా వివిధ రకాల పువ్వులతో అలంకరించిన 20 అడుగుల బతుకమ్మ అందర్నీ ఆకర్షించింది. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ పాటలకు అనుగుణంగా ఆటలాడి సందడి చేశారు. ఈ వేడుకలో సినీ నటి, యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj), ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangli) పాల్గొనడం విశేషం.
ఎక్కడున్నా తన వ్యాఖ్యానంతో సందడి వాతావరణం నెలకొనేలా చేసే అనసూయ.. ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆమె తనదైన యాంకరింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇక మంగ్లీ బతుకమ్మ పాటలతో అందరిలోనూ జోష్ నింపారు. ప్రస్తుతం ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫంక్షన్‌కు లంగా ఓణీలో దర్శనమిచ్చిన అనసూయ లుక్స్‌కు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇకపోతే, గత కొంతకాలంగా అనసూయ బుల్లితెరకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఈమధ్య ఆమె పెద్దగా టీవీ షోలు చేయడం లేదు. దీనికి కారణం ఆమె సినిమాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ‘రంగమార్తాండ’, ‘వేదాంతం రాఘవయ్య’, ‘హరిహర వీరమల్లు’తో పాటు ‘పుష్ప 2’, ‘భోళా శంకర్’ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తూ అనసూయ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాల ఫలితాలను బట్టి ఆమెకు మరిన్ని పెద్ద చిత్రాల్లో నటించే అవకాశాలు రావొచ్చు.