Pushpa 2: 100 కోట్లా.. పుష్ప‌2లో అల్లు అర్జున్‌కి!!!

Updated on Apr 28, 2022 10:47 AM IST
Pushpa 2: పుష్ప సినిమాకు మించి పుష్ప‌2కు డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌. హిందీలో పుష్ప సినిమా కోట్లు కొల్ల‌గొట్టింది. పుష్ఫ‌2 బ‌డ్జెట్ విష‌యంలో ఏ మాత్రం త‌గ్గేదేలే అంటున్నారు నిర్మాత‌లు.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలోవ‌చ్చిన పుష్ప సినిమా ఇండియ‌న్ లెవెల్‌లో హిట్ సాధిచింది. అల్లు అర్జున్ హీరోగా యాక్టింగ్ అద‌ర‌గొట్టార‌ని ప్ర‌తీ ఒక్క‌రు మెచ్చుకుంటున్నారు. క‌లెక్ష‌న్ల విష‌యంలోరికార్డులు తిర‌గ‌రాసింది. హిందీలోనూ 300 కోట్ల రూపాయ‌లు వ‌సూళ్లు సాధించిందంటే మాములు విష‌యం కాదు.

Pushpa 2

అగ్ర‌రాజ్యం అమెరికాలో సుకుమార్ చాలా బిజీగా ఉన్నార‌ట‌. పుష్ప‌2 స్టోరీ హైలెట్ చేయ‌డం కోసం సుకుమార్ ప్ర‌య‌త్నిస్తున్నారు. పుష్ప సినిమా బిజినెస్ మైండ్‌లో పెట్టుకుని పుష్ప2 బ‌డ్జెట్ ఎంతైనా పెంచేందుకు నిర్మాత‌లు రెడీగా ఉన్నారు. అంతేకాదు అల్లు అర్జున్, సుకుమార్ రెమ్యూన‌రేష‌న్ కూడా బాగా పెంచేశార‌ట‌. అల్లు అర్జున్ వంద కోట్ల రెమ్యున‌రేష‌న్ కోట్ చేశాడ‌ట‌.
 
అల్లు అర్జున్ వంద కోట్లు తీసుకుంటుంటే.. సుకుమార్ అందులో ఆఫ్ తీసుకుంటున్నార‌ట‌. అంటే పుష్ప‌2 కోసం సుకుమార్ 50 కోట్ల రూపాయ‌లు తీసుకోనున్నారు. వేస‌వి త‌ర్వాత పుష్ప‌2 సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు. 2023లో పుష్ప‌2 థియేట‌ర్ల‌ను మోత మోగించేందుకు రెడీ అవుతుంది. బాలీవుడ్ యాక్ట‌ర్లను సెలెక్ట్ చేసే ప‌నిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. పుష్ప2 (Pushpa 2)సినిమాలో న‌టించే అవ‌కాశం ఏ హిందీ న‌టుల‌ను వ‌రిస్తుందో చూద్దాం.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!