పెదనాన్న చిరంజీవి (Chiranjeevi) బాటలో అకిరా నందన్ (Akira Nandan)

Updated on Apr 22, 2022 07:58 PM IST
రక్తదానం చేసిన అకిరా నందన్‌
రక్తదానం చేసిన అకిరా నందన్‌

స్టార్‌‌ ఇమేజ్‌ సంపాదించుకున్న హీరోల వారసులు ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి అప్‌డేట్‌ ఏమైనా ఉందా? దానికి సంబంధించిన సమాచారం కోసం నెట్‌లో వెతుకుతూనే ఉంటారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌‌ డమ్‌ తెచ్చుకున్నారు. వారందరికీ చిరంజీవి ఇన్‌స్పిరేషన్. చిరు చేసిన మంచి పనులను చాలామంది ఫాలో అవుతారు కూడా.

ఇక, చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా.. జనాలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి కూడా వచ్చారు. ఇక, పవన్‌ కల్యాణ్‌ పెద్ద కొడుకు అకిరా నందన్.. తాజాగా చేసిన పనిపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్దనాన్న చిరంజీవి బాటలోనే అకిరా నందన్‌ పయనిస్తున్నాడని అంటున్నారు. ఇటీవల మొదటిసారి అకిరా నందన్‌ రక్తదానం చేశాడు. రక్తదానం చేస్తున్న సమయంలో తీసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అకిరా నందన్‌ ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడనే దానిపై మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి అకిరా ఫోకస్‌ అంతా స్టడీస్‌పైనే ఉందని తల్లి రేణుదేశాయ్ ఇటీవల చెప్పారు. సినిమా చేయడానికి అకిరా నందన్‌ ఇటీవల ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని రేణు కొట్టిపారేశారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!