స్పెష‌ల్ స్క్రీన్‌లో పవన్ కల్యాణ్‌కు మేజ‌ర్ (Major) సినిమా చూపిస్తా : అడివి శేష్

Updated on May 27, 2022 03:47 PM IST
సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మేజ‌ర్  (Major) చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచింది
సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మేజ‌ర్ (Major) చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచింది

టాలీవుడ్ యంగ్ హీరో అడ‌వి శేష్ (Adivi Sesh) న‌టించిన 'మేజ‌ర్' పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది. జూన్ 3 తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుదల అవుతోంది. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో 'మేజ‌ర్' (Major) చిత్ర యూనిట్ కూడా ప్ర‌మోష‌న్ల జోరు పెంచింది. అంతేకాకుండా, సోష‌ల్ మీడియాలోనూ నిర్మాతలు పబ్లిసిటీ స్పీడ్ పెంచారు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం విశేషం. శ‌శి కిర‌ణ్ తిక్కా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ ఉన్ని కృష్ణ‌న్ సతీమణి పాత్ర‌లో సాయి మంజ్రేకర్ న‌టించారు. శోభితా ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు


 

'మేజ‌ర్' (Major) సినిమా విడుద‌ల‌కు ప‌ది రోజుల ముందు నుండే, నిర్మాతలు పలుచోట్ల ప్రీమియ‌ర్ షోల‌ను ప్రదర్శించారు. ఓ స్పెష‌ల్ ప్రీమియ‌ర్‌ను ఇటీవలే పూణే నగరంలో కూడా ప్ర‌ద‌ర్శించారు. ఈ ప్రీమియ‌ర్ షోల‌ను చూసిన  అనేకమంది జవాన్లు మేజ‌ర్ చిత్ర యూనిట్‌ను విశేషరీతిలో ప్ర‌శంసిస్తున్నారు. ఇదే క్రమంలో, త‌మ అభిమాన హీరో కోసం 'స్పెష‌ల్ ప్రీమియ‌ర్ షో' ప్ర‌ద‌ర్శించాలంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ అడ‌వి శేష్‌ను కోరారు.

అడ‌వి శేష్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్‌కు రిప్లై ఇచ్చారు. ప‌వ‌న్ కోసం ప‌క్కాగా 'ప్రీమియ‌ర్ షో' వేస్తామంటూ బదులిచ్చారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 'పంజా' సినిమాలో అడ‌వి శేష్ నెగెటివ్ రోల్‌లో యాక్ట్ చేశారు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం' మేజ‌ర్' సినిమాను చూసి ఎలాంటి రివ్యూ ఇస్తారో వేచి చూడాలి.

మేజ‌ర్ (Major) సినిమా స్పెష‌ల్ ప్రీమియ‌ర్‌ను రీసెంట్‌గా పూణేలో ప్ర‌ద‌ర్శించారు

'మేజ‌ర్' చిత్రాన్ని సోనీ పిక్చర్స్ & ఫిల్మ్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్,  ఏ ప్లస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని విడుదలకు ప‌ది రోజుల ముందుగానే... 9 ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప్రీ రిలీజ్ చేశారు.  స్పెష‌ల్ స్క్రీనింగ్‌లో భాగంగా రిలీజ్‌కు ముందే పలు చోట్ల ప్రత్యేకంగా ప్ర‌ద‌ర్శించారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!