చిరులో ఉండే రిథమ్ ఇష్టం - సుమన్(Suman)
మెగాస్టార్ చిరంజీవిపై సుమన్(Suman) ఓ ఇంటర్వ్యూలో పొగడ్తలు వర్షం కురిపించారు. చిరంజీవి బాడీలో రిథమ్ ఉంటుందన్నారు. సుమన్ చిరంజీవిని అసలు ఏమన్నారు?
హీరోగా సుమన్(Suman) తెలుగు ఇండ్రస్ట్రీకి పరిచయం అయ్యారు. అప్పట్లో స్టార్ హీరోలకు పోటీగా యాక్ట్ చేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆరిస్ట్‌గా నటించి స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సుమన్ మెగాస్టార్ చిరంజీవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఆశ్చర్యపరిచాయి.
కమల్ హాసన్ నటన అంటే సుమన్(Suman)కు ఇష్టమట. డాన్స్‌లో మాత్రం మోగాస్టార్ తర్వాతే ఎవరైనా అంటున్నారు సుమన్(Suman). చిరు డాన్స్ చేస్తే రిథమ్ ఉంటుందని చెప్పారు. చిరంజీవి బాడీలోనే రిథమ్ ఉంటుదని.. ఓ గ్రేస్ కనిపిస్తుందని అన్నారు. ఇప్పుడు హీరోలు చాలా ఫాస్ట్‌గా డాన్సులు చేస్తున్నా.. అందులో జిమ్నాస్లిక్స్ ఎక్కువ ఉంటాయని చెప్పారు. చిరంజీవి తర్వాత అంత బాగా డాన్స్ చేసే హీరో ఎన్టీఆర్ అని సుమన్(Suman) ఫీలింగ్ అట. ఎన్టీఆర్ కూడా రిథమ్ ఉండే డాన్స్ చేస్తారన్నారు.
సుమన్(Suman) హీరోగా నటించిన సమయంలో మార్షల్ ఆర్ట్స్ హీరోగా స్కీన్‌ను దద్దరిల్లించారు. అర్జున్, భానుచందర్ ఆ తర్వాత సుమన్ (Suman)మార్షల్ ఆర్ట్స్ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. అన్నయమ్యలో సుమన్ వెంకటేశ్వర స్వామి పాత్ర చాలా మంచి గుర్తింపు తెచ్చిందని సుమన్(Suman) చెప్పుకొచ్చారు.