సోనూసూద్(Sonu Sood) : ఆపదలో ఆత్మబంధువు
సోనూ సూద్(Sonu Sood) కరోనా టైంలో వలస కూలీలకు చేసిన సహాయం ఎవరూ మర్చిపోలేది. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి సోనూ సూద్ ఎప్పుడూ ముందే ఉంటారు. ప్రస్తుతం అత్యంత ఖరీదైన వైద్యానికి విరాళాలు సేకరిస్తున్నారు సోనూ సూద్.
సోనూ సూద్ విలన్ పాత్రల్లో ఎక్కువగా నటించి సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. కరోనా టైంలో సోనూసూద్ హీరోయిజం ఏంటో అందరికీ తెలిసింది. ముఖ్యంగా వలస కూలీలను ఆదుకోవడంలో సోనూసూద్ ఎవరూ చేయలేని సాహసం చేశారు. తాను కష్టపడి సంపాదించిన దానిలో కోట్ల రూపాయలను పేదలకే ఖర్చు చేశారు.
మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన ఓ చిన్నారి విహాన్ స్పైనల్ మస్కులర్ ఆత్రోపి అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి జాల్ గెన్జ్ మా అనే ఇంజక్షన్ ఇవ్వాలి. అయితే ఆ ఇంజక్షన్ అమెరికా నుంచి తెప్పించాలి. సుమారు 16 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఆ చిన్నారి వ్యాధి తగ్గించాడానికి పెద్ద మొత్తంలో విరాళం అందించారు. అంతేకాకుండా మిగతా డబ్బు సేకరించేందుకు కోసం విరాళాలు సేకరిస్తున్నారు సోనూ సూద్.
బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, మనోజ్ జాబ్పాయ్ వంటి ప్రముఖులు కూడా ఆర్థిక సాయం చేస్తున్నారు. సోషల్ మీడియా, సన్నిహితుల ద్వారా చిన్నారి తల్లిదండ్రులు విరాళాలు సేకరించారు. విహాన్ కోసం ఇంకా 12 కోట్లు జమ చేయాల్సి ఉంది. సోనూ సూద్ హాస్పటల్‌కు వెళ్లి మరీ చిన్నారి విహాన్‌ను పలకరించారు. తాను ఉన్నానంటూ.. భయపడవద్దంటూ విహాన్ తల్లిదండ్రులకు సోనూ సూద్ (Sonu Sood) ధైర్యం చెప్పారు.