The Warrior: శింబు పాటకు.. డ్యాన్స్ ఇరగదీసిన ఇస్మార్ట్ శంకర్ రామ్

Updated on Apr 20, 2022 11:26 PM IST
ఒక పవర్ఫుల్ అండ్ సిన్సియర్ పోలీస్ అధికారి పాత్రలో ఈ సినిమాలో రామ్ నటిస్తున్నాడు.
ఒక పవర్ఫుల్ అండ్ సిన్సియర్ పోలీస్ అధికారి పాత్రలో ఈ సినిమాలో రామ్ నటిస్తున్నాడు.

హీరో రామ్ పోతినేని ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'ది వారియర్'.  తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ సినిమా దర్శకుడు. ఈయన తొలిసారిగా మన ఇస్మార్ట్ శంకర్ రామ్‌తో కలిసి పనిచేయడంతో.. ఈ సినిమాపై బయ్యర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి ఈ సినిమాలో కథానాయిక.

ఒక పవర్ఫుల్ అండ్ సిన్సియర్ పోలీస్ అధికారి పాత్రలో ఈ సినిమాలో రామ్ నటిస్తున్నాడు. పైగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత, రామ్ మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. దీంతో యాక్షన్ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ సినిమా అనగానే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది.  

తమిళ, తెలుగు భాషాల్లో సంయుక్తంగా నిర్మితమయ్యే ఈ సినిమాలో 'బులెట్' సాంగ్ పేరుతో పాపులర్ అయిన ప్రత్యేక గీతాన్ని శింబు పాడనున్నారు. ఇటీవలే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. దేవీశ్రీప్రసాద్ దీనిని కంపోజ్ చేశారు. శ్రీమణి ఈ పాటకు సాహిత్యాన్ని అందించగా, రామ్ తన హీరోయిన్‌తో కలిసి ఇదే పాటకు డ్యాన్స్‌ను ఇరగదీశారు. ఈ పాట పూర్తి వీడియో ఈ నెల 22న విడుదల కానుంది. 

శింబు గతంలో కూడా చాలా సినిమాలకు పాటలు పాడారు. పోటుగాడు, తిక్క లాంటి తెలుగు సినిమాలో కూడా తన గీతాలతో అలరించారు. దర్శకుడు టి.రాజేందర్ తనయుడైన శింబుకి తమిళనాడులో ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ హీరో నటించిన మన్మధ, వల్లభ లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా అలరించాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!