Shekar Movie Twitter Review: శేఖర్ మూవీ ట్విట్టర్ రిపోర్ట్ - థ్రిల్ల‌ర్ సినిమా బాగుందంటున్న నెటిజ‌న్లు !

Updated on May 22, 2022 05:31 PM IST
Shekar Movie twitter Review: యాంగ్రీస్టార్ రాజ‌శేఖ‌ర్ న‌టించిన శేఖ‌ర్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది
Shekar Movie twitter Review: యాంగ్రీస్టార్ రాజ‌శేఖ‌ర్ న‌టించిన శేఖ‌ర్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది

Shekar Movie twitter Review: యాంగ్రీ స్టార్ రాజ‌శేఖ‌ర్ న‌టించిన 'శేఖ‌ర్' సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ రోజే రిలీజ్ అయింది. ట్విటర్ వేదికగా నెటిజ‌న్లు శేఖ‌ర్ మూవీపై ఏమంటున్నారు?. ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా రాజ‌శేఖ‌ర్ మెప్పించాడా లేదా? సినిమా కథాంశం ఎలా ఉంది? లాంటి విశేషాలను మనమూ తెలుసుకుందాం 

సినిమా కథ
శేఖ‌ర్ సినిమాలో రాజ‌శేఖ‌ర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా న‌టించారు. ఆ పాత్రలో ఆయన జీవించారనే చెప్పాలి. క్రైమ్ కేసుల్లో ఉన్న చిక్కుముడుల‌న్నీ విడ‌దీసి.. అస‌లైన నేర‌స్తుల‌ను క‌నిపెట్టడమే శేఖ‌ర్ పని. రాజ‌శేఖ‌ర్ కూతురు శివానీ రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాలో కూడా.. ఆయన కుమార్తెగానే న‌టించింది. ముఖ్యంగా తండ్రీ, కూతుళ్ళ బంధానికి ఉండే పటిష్టతను తెలిపే ఫాద‌ర్ సాంగ్ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. ఇక కథ విషయానికి వస్తే, ఓ డ‌బుల్ మ‌ర్డ‌ర్ కేసులో శేఖ‌ర్ సాయం అడుగుతారు పోలీసులు. అలాగే శేఖ‌ర్ భార్య ఇందు పాత్ర సినిమాకి కీలకం. శేఖ‌ర్, ఇందులు ఎందుకు విడిపోతారు.. ఆ త‌ర్వాత ఇందుకు ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది? ఇందును హ‌త్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీక‌రించింది ఎవ‌రు?  ఈ కోణంలో సాగే శేఖ‌ర్ ఇన్వెస్టిగేషన్ ఎలా ముగుస్తుంది అన్నదే చిత్రకథ.   

న‌టీన‌టులు
డా. రాజ‌శేఖ‌ర్, శివానీ రాజ‌శేఖ‌ర్, ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర

చిత్ర యూనిట్
జీవితా రాజ‌శేఖ‌ర్ శేఖ‌ర్ సినిమాను డైరెక్ట్ చేశారు. జీవిత రాజశేఖర్ గతంలో చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే ఓ మలయాళ సినిమాకి రీమేక్‌గా వ‌చ్చిన శేఖ‌ర్‌ను, అంత ప‌ర్పెక్ట్‌గా తీయ‌లేద‌నే టాక్ వినిపిస్తుంది.  సినిమాటోగ్రాఫర్ మల్లికార్జున్ నారగాని పనితీరు బాగుంది. ముఖ్యంగా విజువల్స్ ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. అలాగే అనూప్  సంగీతం బాగుంది. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

నెటిజ‌న్లు ఏమంటున్నారు?
శేఖ‌ర్ సినిమా బాగుందంటూ చాలామంది సినీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.  అయితే థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉన్నా.. డెప్త్ త‌క్కువంటున్నారు. ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా రాజ‌శేఖ‌ర్ (Actor Rajasekhar) బాగానే చేశార‌ని టాక్. సినిమాలో కథా బలం ఉంటే,  ఇంకా బాగుండేద‌నే వాదన వినిపిస్తోంది. ఓవ‌రాల్‌గా సినిమా మొత్తం బాగానే ఉందంటున్నారు ప్రేక్షకులు. థ్రిల్ల‌ర్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని కొందరి భావన. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!