ఆచార్య(Acharya)కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఆచార్య(Acharya) సినిమా టికెట్ రేటు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా రేటుకు సంబంధించి జీవో కూడా జారీ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఆచార్య(Acharya) విడుదలకు సిద్ధంగా ఉంది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌తో కలిసి నటించిన ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఆచార్య ట్రైలర్ అంచనాలు రెట్టింపు చేసింది. యాక్షన్ మూవీగా ప్రేక్షకులకు వినోదం పంచనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచార్య(Acharya) సినిమాకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆచార్య టికెట్ రేట్లను పెంచుకునేందకు అనుమతిని ఇచ్చింది. ఏప్రిల్ 29నుంచి పది రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునే విధంగా జీవో రిలీజ్ చేసింది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ ... ఇలా ఏ స్కీన్ అయినా ఒక్కో టికెట్‌పై 50 రూపాయలు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఆచార్య షూటింగ్‌ను మారెడు మిల్లి అడవిల్లో తీశారు. సినిమాకు అయిన బడ్జెట్ అంశాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు జారీ చేసింది.
తెలంగాణలో ఆచార్య(Acharya) సినిమా టికెట్ రేటు వారం రోజుల పాటు పెంచుకునే అవకాశం కల్పించింది. ఒక్కో టికెట్ పై మల్టీప్లెక్స్‌లో 50 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 30 రూపాయల వరకు పెంచుకునే వీలు కల్పించింది. వారం రోజుల పాటు ఐదో ఆటకు కూడా పర్మిషన్ ఇచ్చింది.