పెళ్లికి సిద్ధమవుతున్న కియారా (Kiara Advani), సిద్ధార్థ్ (Sidharth Malhotra) జోడీ!.. మ్యారేజ్ డేట్ ఫిక్స్?
బాలీవుడ్ స్టార్ నటులు కియారా అద్వానీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) పెళ్లిపై చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. త్వరలో వీరిద్దరూ ఒకటవ్వబోతున్నారంటూ చాలా మంది చెవులు కొరుక్కున్నారు. కియారా, సిద్ధార్థ్ మధ్య బ్రేకప్ అయ్యిందంటూ కూడా గాసిప్స్ షికారు చేశాయి. అయితే ఇటీవల ముంబైలో జరిగిన కొన్ని ప్రీమియర్లకు వీరిద్దరూ జంటగా హాజరవ్వడంతో ఈ రూమర్లకు బ్రేక్ పడింది. ఇప్పుడీ కపుల్స్‌పై మరో వార్త హల్‌చల్ చేస్తున్నది.
కియారా, సిద్ధార్థ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనేది ముంబై మీడియా సమాచారం. వచ్చే ఏడాది ఈ జంట వివాహం జరగనుందని బాలీవుడ్ టాక్. ఢిల్లీలోని రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుని.. తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలని కియారా, సిద్ధార్థ్‌లు ఫిక్స్ అయ్యారట. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా ఇటీవలే దేశ రాజధానిలోని ఓ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారట.
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కియారా, సిద్ధార్థ్ పెళ్లి జరగనుందట. ఈ వేడుకను సాదాసీదాగా, కొద్ది మంది సమక్షంలో జరపాలని ఈ స్టార్ కపుల్స్ ఫిక్స్ అయ్యారట. ఇరు కుటుంబాలకు చెందిన కొంత మంది బంధువులను మాత్రమే ఈవెంట్‌కు ఆహ్వానించనున్నారట. వివాహం తర్వాత ముంబైలో సినీ పరిశ్రమతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను పిలిచి, విందు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై కియారా, సిద్ధార్థ్ ఇంకా స్పందించలేదు. వారు అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఈ విషయంలో అప్పుడిప్పుడే ఓ క్లారిటీ రాదు. మరి, పెళ్లి వార్తలపై వీరిద్దరూ స్పందిస్తారో లేదో చూడాలి.
ఇక సిద్ధార్త్ మల్హోత్రా కెరీర్ విషయానికొస్తే.. ఆయన నటించిన ‘థ్యాంక్ గాడ్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ కూడా యాక్ట్ చేయడం విశేషం. ఇక, ఈ ఏడాది ‘భూల్ భులయ్యా 2’ చిత్రంతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న కియారా.. బోలెడు ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజాగా ఉన్నారు. రామ్ చరణ్ ‘ఆర్‌సీ15’లో యాక్ట్ చేస్తున్న ఆమె.. ‘సత్యప్రేమ్ కీ కథా’, ‘గోవిందా నామ్ మేరా’ మూవీల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Read more: Kiara Advani: చావు అంచుల వరకు వెళ్లా.. హారర్ సినిమాలంటే భయం అంటున్న కియారా ఆడ్వాణీ